https://oktelugu.com/

Dil Raju : తప్పుడు వార్తలను రాస్తున్న కొన్ని వెబ్ సైట్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దిల్ రాజు…

ఇక మిగిలిన సినిమాలకి కొన్ని థియేటర్లు మాత్రమే దక్కాయి అయితే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన చిరంజీవి కూడా హనుమాన్ సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కకపోవడం మీద మాట్లాడుతూ

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2024 / 08:19 AM IST
    Follow us on

    Dil Raju : ప్రస్తుతం సంక్రాంతి సినిమాల మధ్య పోటీ విపరీతంగా నడుస్తుంది. అయితే ఈ కారణంగా గత కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందిన దిల్ రాజు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆయన మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. అలాగే కొన్ని వెబ్ సైట్ లు కూడా ఇష్టం వచ్చినట్టుగా కథనాలను రాశాయి. ఇక దాంతో రీసెంట్ గా ఈ విషయం మీద దిల్ రాజు స్పందిస్తూ నేను మాట్లాడిన మాటలకి కొన్ని వెబ్ సైట్స్ రాసిన దానికి అసలు సంబంధం లేకుండా ఉంది. నేను మాట్లాడింది ఒకటైతే కొన్ని వెబ్ సైట్లు దాన్ని వక్రీకరించి నేను నెగిటివ్ గా మాట్లాడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

    నా మీద ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే ఊరుకునేది లేదు అంటూ దిల్ రాజు కొన్ని వెబ్ సైట్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. నేను హనుమాన్ సినిమాని సంక్రాంతి భరి నుంచి తప్పుకోమని చెప్పలేదు. భారీ పోటీ ఉన్నప్పుడు వేరే డేట్ ఏదైనా చూసుకుంటే బాగుండేది కదా అని మాత్రమే అన్నాను. అంటూ దిల్ రాజు హనుమాన్ సినిమా మీద చేసిన కామెంట్లను మరొకసారి గుర్తు చేశాడు… మొత్తానికైతే తప్పుడు వార్తలు రాసిన కొన్ని వెబ్ సైట్ల మీద దిల్ రాజు ఫైర్ అయ్యారు…

    ఇక ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీలో ఉన్నాయి. అందులో మూడు స్టార్ హీరోల సినిమాలు కాగా ఒకటి యంగ్ హీరో సినిమా కావడం విశేషం… ఇక ఈ సంక్రాంతికి ఏ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడు అందరి మైండ్ లో మెదులుతున్న ప్రశ్న. గుంటూరు కారం సినిమాని దిల్ రాజు నైజం లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమాకి ఆటోమేటిక్ గా థియేటర్లు కూడా ఎక్కువగా కేటాయించుకున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక మిగిలిన సినిమాలకి కొన్ని థియేటర్లు మాత్రమే దక్కాయి అయితే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన చిరంజీవి కూడా హనుమాన్ సినిమాకి ఎక్కువ థియేటర్లు దక్కకపోవడం మీద మాట్లాడుతూ సినిమా బాగుంటే తక్కువ థియేటర్ల లో రిలీజ్ అయిన కూడా ఆ సినిమాని ఇవాళ్ల కాకపోతే రేపైనా ప్రేక్షకులు చూసి ఆదరిస్తారు అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు…