Dil Raju : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఇండస్ట్రీ ముందుకు దూసుకెళ్లడం అనేది ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించే విషయమనే చెప్పాలి… మరి ఇలాంటి సందర్భంలో మన ఇండస్ట్రీ ఇండియాలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ గా ఎదగడం దానికి తగ్గట్టుగానే మన హీరోలు భారీ సక్సెస్ లను సాధిస్తూ ఉండడం వల్ల మనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని తెచ్చిపెట్టడంలో మన హీరోలు చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 సినిమాలకు పైన తీసి టాప్ ప్రొడ్యూసర్ గా గుర్తింపును సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు…డైరెక్టర్ తో అవసరం లేకుండా దిల్ రాజు నుంచి ఒక సినిమా వచ్చింది అంటే చాలు యావత్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఆ సినిమాని చూడొచ్చు అనే ఒక గొప్ప పేరునైతే సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి దిల్ రాజు ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ తో చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే వెంకటేష్ హీరోగా వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సాధించి ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసి పెట్టాలనే ఉద్దేశ్యం తో ఆయన ఈ సినిమాలను పందక్కి తీసుకువస్తున్నాడు..
మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ప్రస్తుతం భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరం కూడా ఉంది…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ‘తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్’ (టిఎఫ్ డిసి) గా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి ఆయన అలా ఎదగడం పట్ల యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు… ఇక ఈ విషయం మీద దిల్ రాజు మాట్లాడుతూ నన్ను టిఎఫ్ డిసి చైర్మన్ గా నియమించిన సిఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు…
టిఎఫ్ డిసి అనేది ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి ఒక వారధి లా ఉంటుందని దానికోసం నేను శ్రమిస్తానని చెప్పాడు. అలాగే మద్రాసు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ సపరేట్ అయిన తర్వాత చాలా సమస్యలను ఎదుర్కొన్నామని మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో నిలదొక్కుకుందని తెలియజేశాడు.
ఇక రీసెంట్ గా ఒక థియేటర్ దగ్గర జరిగిన సంఘటనలో ఒక హీరో అరెస్టయ్యాడు…అయితే ఆ హీరో అరెస్టు లో తెలంగాణ గవర్నమెంట్ చాలా కీలక పాత్ర వహించింది…మరి అలాంటి గవర్నమెంట్ తోనే దిల్ రాజు స్నేహ పూర్వక సంబంధాలు కలిగి ఉండటం పట్ల హీరోల విషయంలో ఇది దిల్ రాజుకి ఏమన్నా మైనస్ అవ్వచ్చా…ఇక ఇండస్ట్రీ ఇలాంటి ఉపద్రవాలు జరగడం పట్ల ఈ పదవి కూడా తనకి రాదేమో అని అందరూ అనుకున్నారు కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి దిల్ రాజు కి ఈ పదవి ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు…ఇక దాంతో ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి ఉన్న సమస్యలకు చెక్ పెట్టినట్టేనా అనేది తెలియాల్సి ఉంది…
మరి ఏది ఏమైనా కూడా ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే ధోరణిలో చర్చలు జరుపుతానని ఆయన చెబుతూ ఉండడం విశేషం… ఇక అలాగే సింగిల్ విండో పర్మిషన్స్ కోసం ప్రొడ్యూసర్స్ ఎప్పుడు కోరుతూ ఉంటారని దాన్ని ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లి దానికి ఒక పరిష్కారం చూపిస్తానని చెప్పాడు…