https://oktelugu.com/

Acharya Effect: కొరటాల శివ ఆఫీసులో తిష్టవేసిన ‘ఆచార్య బయ్యర్లు’.. అప్పులు కడుతారా? లేదా?

Acharya Effect: ‘ఆచార్య’ దెబ్బకు ఆ సినిమాని కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయారు. బయ్యర్లకు కూడా భారీ నష్టాలతో కుప్పకూలిపోయారు. చాలా ఏరియాల్లో ఆచార్య సినిమా కనీస కలెక్షన్స్ కూడా రాబట్టలేక చతికిలపడింది. ఐతే, రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా.. ఆచార్య ఎఫెక్ట్ నుంచి కొరటాల మాత్రం ఇప్పట్లో బయటపడేలా లేడు. ప్రస్తుతం కొరటాల శివ ఆఫీసులో ‘ఆచార్య బయ్యర్లు’ తిష్ట వేశారు. సీడెడ్ కు చెందిన పాతిక మంది ఎగ్జిబిటర్లు, సెకండరీ బయ్యర్లతో కలిసి నిన్న […]

Written By:
  • Shiva
  • , Updated On : July 13, 2022 / 03:43 PM IST
    Follow us on

    Acharya Effect: ‘ఆచార్య’ దెబ్బకు ఆ సినిమాని కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయారు. బయ్యర్లకు కూడా భారీ నష్టాలతో కుప్పకూలిపోయారు. చాలా ఏరియాల్లో ఆచార్య సినిమా కనీస కలెక్షన్స్ కూడా రాబట్టలేక చతికిలపడింది. ఐతే, రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా.. ఆచార్య ఎఫెక్ట్ నుంచి కొరటాల మాత్రం ఇప్పట్లో బయటపడేలా లేడు. ప్రస్తుతం కొరటాల శివ ఆఫీసులో ‘ఆచార్య బయ్యర్లు’ తిష్ట వేశారు. సీడెడ్ కు చెందిన పాతిక మంది ఎగ్జిబిటర్లు, సెకండరీ బయ్యర్లతో కలిసి నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని కొరటాల అఫీస్ కి వచ్చారు. ‘మా నష్టాల పరిస్థితి ఏమిటి ?’ అంటూ రాత్రి నుంచి వారందరూ అదే అఫీస్ లో ఉన్నారు. అక్కడే స్నానాలు, అక్కడే భోజనాలు చేస్తూ నష్టపరికాహారం చెల్లించాలని, అర్జెంట్ గా కొరటాల శివ, ఆయన స్నేహితుడు సుధాకర్ ఇక్కడకి వచ్చి తమతో చర్చించాలని వారంతా అక్కడే భైటాయించారు.

    Koratala Siva

    ఈ రోజు ఉదయం మైత్రీ సంస్థ అధినేత నవీన్ రాయబారానికి వెళ్ళాడు. వారందరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా వాళ్లు వినే పరిస్థితిలో లేరు. కారణం.. పదుల సంఖ్యలో బయ్యర్లు ఉన్నారు. ఒకరు విన్నా మరొకరు వినడం లేదు. ఇగోల సమస్యలతో కొందరు పెద్ద ఇష్యూ చేస్తున్నారు. నిజానికి సీడెడ్ బయ్యర్ అభిషేక్ ‘ఆచార్య సీడెడ్ రైట్స్’ కొన్నాడు. అతను లోకల్ బయ్యర్లకు సినిమాని అమ్మాడు. ఆ కొనుక్కున్నవాళ్లంతా బాగా నష్టపోయారు. సినిమా రిలీజ్ అయిన సమయంలో నష్టాలు పంచుకోవాలని నిర్మాతల పై బయ్యర్లు తీవ్రంగా ఒత్తిడి చేశారు. నిర్మాతలు ‘చేద్దాం’ అంటూ ఇన్నాళ్లు పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వచ్చారు.

    Also Read: Sudigali Sudheer- Hyper Aadi: సుడిగాలి సుధీర్‌ కి అవమానం ? షాకింగ్ విషయాలు చెప్పిన హైపర్ ఆది

    అయితే, రీసెంట్ గా ఆంధ్ర ఏరియాలో నష్టపోయిన ‘ఆచార్య బయ్యర్ల’కు నిర్మాతలు కొంత సెటిల్ మెంట్లు చేసారు. ఇక్కడే వచ్చింది సమస్య. ‘వారికీ చేసి మాకెందుకు చెయ్యరు ?’ అంటూ సీడెడ్ బయ్యర్లు రంగంలోకి దిగారు. అందరూ వచ్చి కొరటాల అఫీస్ లో కూర్చున్నారు. లోకల్ బయ్యర్లతో పాటు సీడెడ్ బయ్యర్ అభిషేక్, ఫైనాన్సియర్ శోభన్ కూడా అక్కడే ఉన్నారు. తమకు 15 కోట్లు నష్టం వచ్చిందని, కాబట్టి ఏదో కొంత ఇస్తే సరిపోదు అని, సంగం నష్టాన్ని భరించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ ను అంగీకరించకపోతే ఎల్లుండి 250 మందితో చిరంజీవి ఇంటికి వెళ్తామని వార్నింగ్ ఇస్తున్నారు.

    Koratala Siva

    అసలు ఇంతకుముందు చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. కానీ ఏ ప్లాప్ సినిమాకు ఇలాంటి రాద్దాంతం ఈ స్థాయిలో ఎన్నడూ జరగలేదు. కొన్ని ప్లాప్ సినిమాలకు బయ్యర్లు రిక్వెస్ట్ చేసి, నిర్మాతల నుంచి కొంత డబ్బు తీసుకునేవారు. కానీ, ఆచార్య సినిమాకే బయ్యర్లు ఎందుకు ఇలా చేస్తున్నారు ?, కారణం ఒక్కటే. ‘చిరంజీవి – రామ్ చరణ్’ ఇద్దరు కలిసి చేసిన సినిమా అంటూ ఆచార్య చిత్రాన్ని భారీ రేట్లకు అమ్మారు. లాభాల మాట దేవుడెరుగు.. బాక్సాఫీస్ లెక్కలను బట్టి బయ్యర్లకు 60% నుంచి 70% వరకూ నష్టం వచ్చింది.

    ఎక్కువ రేట్లకు కొని నిండా మునిగిపోయాం అని బయ్యర్లలో ఆక్రోశం పెరుగుతూ వచ్చింది. పైగా, సినిమాకి ప్లాప్ టాక్ రాగానే.. ‘మీ నష్టాల్లో మేము ఉంటాం, ,మిమ్మల్ని ఆదుకుంటాం, సినిమాని బాగా ప్రమోట్ చేయండి’ అని కొరటాల బయ్యర్లకు మాట ఇచ్చాడు. కానీ, ఆ తర్వాత బయ్యర్లకు ఇచ్చిన మాటను, చెప్పిన హామీను పట్టించుకునే స్థితిలో కొరటాల లేడు. మరోపక్క నిర్మాత నిరంజన్ రెడ్డి బయ్యర్లకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు బయ్యర్లంతా ఏమి చేయాలో అర్ధం కానీ పరిస్థితి లో.. కొరటాల అఫీస్ లో తిష్ట వేశారు. చిరంజీవి ఇంటికి కూడా వెళ్తామని బెదిరిస్తున్నారు. ఈ వివాదానికి ఇప్పుడు చిరు మాత్రమే ఫుల్ స్టాప్ పెట్టగలడు. మరి చిరు ఎప్పుడు రియాక్ట్ అవుతాడో చూడాలి.

    Also Read:Sreeleela: ఐటమ్ సాంగ్స్ కి క్రేజీ బ్యూటీ సై.. ఆ స్టార్ హీరో సినిమాలో ఫిక్స్

    Tags