Akhil Akkineni: కండలతో పాటు బడ్జెట్ పెంచితే కష్టం కదా !

Akhil Akkineni: అఖిల్ అక్కినేని ఎంత కష్టపడినా ఇంకా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. గుడ్డిలో మెల్ల లాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఓ ఏవరేజ్ హిట్ ను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ సినిమాకు కూడా థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. దాంతో అఖిల్ బాగా నిరాశ పడ్డాడు. అయితే, ఆ నిరాశ నుంచి త్వరగా బయటకు వచ్చేసి మొత్తానికి తన కొత్త సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు. […]

Written By: Shiva, Updated On : January 1, 2022 4:49 pm
Follow us on

Akhil Akkineni: అఖిల్ అక్కినేని ఎంత కష్టపడినా ఇంకా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. గుడ్డిలో మెల్ల లాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఓ ఏవరేజ్ హిట్ ను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఆ సినిమాకు కూడా థియేటర్స్ నుంచి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. దాంతో అఖిల్ బాగా నిరాశ పడ్డాడు. అయితే, ఆ నిరాశ నుంచి త్వరగా బయటకు వచ్చేసి మొత్తానికి తన కొత్త సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడు.

Akhil Akkineni

దర్శకుడు సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ అంటూ అక్కినేని అఖిల్ తో భారీ కసరత్తులు చేయిస్తున్నాడు. మొదట సిక్స్ ప్యాక్ అన్నారు. ఆ తర్వాత అంతకు మించి అంటున్నారు. దానికి తగ్గట్టుగానే అఖిల్ కూడా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. తాజాగా తన కొత్త లుక్ ను అఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అఖిల్ పోస్ట్ చేసిన ఈ కొత్త ఫోటోలో అఖిల్ లుక్ చాలా వైల్డ్ గా ఉంది.

తన నరాలు కూడా ఎముకలు లాగా బలంగా లావుగా కనిపించేంతగా అఖిల్ ఈ సినిమా కోసం బాడీని పెంచాడు. కండలు తిరిగిన దేహంతో ఒళ్ళు విరుచుకుంటూ అఖిల్ ఇచ్చిన ఫోజు మరీ వైల్డ్ గా ఉంది. ప్రస్తుతానికి అఖిల్ లుక్ బాగా వైరల్ అవుతుంది. నిజానికి అఖిల్ చాలా కాలంగా జిమ్ కే ఎక్కువ టైమ్ కేటాయించాడు.

Also Read: ఆ సింగర్ కోసం మహేష్ పైరవీలు చేశాడట !

కాగా తన కష్టాన్ని ఒక్క పోస్టర్ లోనే కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇక, ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెడుతున్నారు. అఖిల్ మార్కెట్ స్థాయి కంటే రెట్టింపు పెట్టుబడి పెడుతున్నారు. మెగాస్టార్ తో వందల కోట్ల బడ్జెట్ తో సైరా తీసిన సురేందర్ రెడ్డి ఆ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చాడు.

మరి ఇప్పుడు అఖిల్ తో కూడా సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ ను పెట్టిస్తున్నాడు. మరి ఈ బడ్జెట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అయినా కండలతో పాటు బడ్జెట్ కూడా పెంచితే కష్టం అని ఎందుకు అర్థం కావడం లేదో ?. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read: బ్రేకప్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శృతి హాసన్… ఫ్యాన్ కి స్ట్రాంగ్ కౌంటర్

Tags