Naveen Polishetty And Vijay Deverakonda: ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోగా మారిన నటుడు విజయ్ దేవరకొండ…ఇక అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఆయన తొందర్లోనే టైర్ వన్ హీరోగా మారబోతున్నాడు అంటూ చాలా వార్తలు వచ్చినప్పటికి అవి నిజమైతే కాలేదు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించినప్పటికి కమర్షియల్ గా సక్సెస్ లను సాధించలేకపోవడంతో అతను కొంతవరకు డైలమాలోనే ఉన్నాడు. గత సంవత్సరం వచ్చిన కింగ్ డమ్ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధిస్తారని ప్రతి ఒక్కరు అనుకున్నప్పటికి అది వర్కౌట్ కాలేదు… దాంతో ఇప్పుడు ‘రౌడీ జనార్దన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సైతం సక్సెస్ సాధిస్తే బాగుంటుంనే ఆలోచనలో తను ఉన్నాడు. మరి తన అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో హీరోగా మారిన నవీన్ పోలిశెట్టి ఆ తర్వాత జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు…నవీన్ కామెడీ టైమింగ్ బాగుంటుందని ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. ఇంకా ప్రేక్షకులు సైతం అతని కామెడీ టైమింగ్ కి ఫ్యాన్స్ అయిపోయారు…
ఇక విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి ఇద్దరు ఒకేసారి వల్ల కెరియర్ ను స్టార్ట్ చేశారు. నిజానికి ఇద్దరు థియేటర్ ఆర్టిస్ట్స్ కావడం విశేషం…ప్రస్తుతం ఇద్దరు హీరోలయ్యారు. ఇక వీళ్ళ మధ్య ఉన్న తేడా ఏంటి అంటే విజయ్ దేవరకొండ భారీ ఎత్తున సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…
నవీన్ ఒక సినిమా కథ ఒకే చేసే ముందు అందులో మార్పులు చేర్పులను చేసి మరి ఆ సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్లే ఆయన ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికి చాలా తక్కువ సినిమాలను చేశాడు. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ ని సాధించడం విశేషం…మొత్తానికైతే విజయ్ స్టార్ హీరోగా మారడానికి పెద్ద స్కేల్ లో సినిమాలను చేస్తున్నాడు అవి కొన్ని సార్లు తేడ కొడుతున్నాయి…కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నాడు…అవి తప్పకుండా సక్సెస్ అవుతున్నాయి…
