Singer Sunitha Daughter: జీవితం అంటేనే ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు. సమస్యలు వచ్చాయని కుంగిపోకుండా మన టైం వచ్చే వరకు సహనంగా ఎదురుచూస్తే అప్పుడు జీవితం ఆనందమయం అవుతుంది. సింగర్ సునీత జీవితం దీనికి గొప్ప ఉదాహరణ. స్టార్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీతది రెండు దశాబ్దాలకు పైగా ప్రస్థానం. 17 ఏళ్లకే ప్లే బ్యాక్ సింగర్ గా మారిన సునీత 19 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతి తక్కువ ప్రాయంలో పెళ్లి చేసుకున్న ఆమె ఓ అబ్బాయి, అమ్మాయికి జన్మనిచ్చారు.

జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో భర్తతో విబేధాలు తలెత్తాయి. విడాకులు ఇచ్చి ఇద్దరు పిల్లలతో పేరెంట్స్ వద్దకు వచ్చేశారు. అలాగే ఓ దశలో సునీత ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. పరిశ్రమలో ఒత్తిళ్లు, అణచివేతలు ఎదుర్కొన్నారు. అన్నింటినీ ఎదిరించి నిలిచిన సునీత ప్రస్తుతం హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త , మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని సునీతను ఇష్టపడ్డారు. చాలా కాలంగా పరిచయం ఉన్నప్పటికీ రామ్ మనసులో కోరిక బయటపెట్టలేదు.

2020 లాక్ డౌన్ సమయంలో రామ్ ఫైనల్ గా ఓపెన్ అయ్యారు. సునీత ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. వెంటనే ఓకే చెప్పకుండా సునీత పేరెంట్స్, పిల్లలతో ఈ విషయం చర్చించి, వాళ్ళ అనుమతితో ఓకె చెప్పారు. రామ్-సునీత వివాహం పిల్లలు ఆకాష్, శ్రేయ దగ్గరుండి నిర్వహించారు. రామ్ తో వివాహం తర్వాత సునీత జీవితం మారిపోయింది. ఆమె ఆనందకర జీవితం అనుభవిస్తున్నారు. కెరీర్ లో కూడా బిజీ అయ్యారు. పాడుతా తీయగా లేటెస్ట్ సీజన్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

Also Read: Govt Of AP Shocks Alcohol Drinkers: నచ్చింది కాదు ఇచ్చిందే తాగండి.. ఏపీ మందుబాబులకు సర్కార్ షాక్ లు
అలాగే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక జూన్ 19న కూతురు శ్రేయ పుట్టినరోజు. ఈ సందర్భంగా సునీత ఇంస్టాగ్రామ్ లో బర్త్ డే విషెస్ తెలియజేశారు. అలాగే శ్రేయ ఫోటోలు షేర్ చేశారు. ఇక శ్రేయకు బర్త్ డే విషెస్ చెబుతున్న సునీత ఫ్యాన్స్… వాళ్ళ అమ్మ మాదిరే అందంగా ఉంది. ఆమె అందం ముందు హీరోయిన్స్ సరిపోరు అంటున్నారు. ఇక శ్రేయ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రేయ సింగర్ గా రాణిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో పాడారు. కొడుకు ఆకాష్ ని మాత్రం హీరోగా చూడాలని సునీత కోరుకుంటున్నారు. ఆకాష్ వెండితెర ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

Also Read: Konaseema District: ‘కొనసీమ’పై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ..ఆ రోజే ప్రకటన?
Recommended Videos:
[…] Also Read: Singer Sunitha Daughter: సింగర్ సునీత కూతురిని చూశార… […]
[…] Also Read: Singer Sunitha Daughter: సింగర్ సునీత కూతురిని చూశార… […]