Pawan Kalyan OG Glimpse : పవన్ కళ్యాణ్ ఓజీ ఫస్ట్ గ్లింప్స్ తో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఫ్యాన్ బాయ్ సుజీత్ పవన్ కళ్యాణ్ ని ఎవరూ ఊహించని విధంగా ప్రజెంట్ చేశాడు. ఫెరోషియస్, డెంజరస్ గ్యాంగ్ స్టర్ గా పవన్ క్యారెక్టరైజేషన్ ఉంది. పాత్ర ఎలివేషన్ అదిరిపోయింది. అతడు నరికిన మనుషుల రక్తం ఏ తుపాను కూడా కడగలేకపోయిందన్న డైలాగ్ పవన్ కళ్యాణ్ ని ఓ కిల్లింగ్ మెషీన్ లా చూపించబోతున్నాడని అర్థం అవుతుంది. ఒకటిన్నర నిమిషాల పాటు సాగిన విజువల్స్ గూస్ బంప్స్ రేపాయి. పవన్ కళ్యాణ్ పీరియాడిక్ లుక్ ఆకట్టుకుంది. 50-60 ల కాలం నాటి డాన్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని సమాచారం.
పవన్ కళ్యాణ్ బర్త్ డే పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ఓజీ గ్లింప్స్ విడుదల చేశారు. నిన్న తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ అయ్యింది. నేడు తమిళ్, హిందీ వెర్షన్స్ సైతం విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీకి కూడా అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అయితే మూడు టీజర్స్ లో ఒకటి కామన్ గా ఉంది.
గ్లింప్స్ చివర్లో పవన్ కళ్యాణ్ మరాఠీ డైలాగ్స్ చెబుతాడు. ఈ డైలాగ్స్ మాత్రం మారలేదు. తెలుగు, తమిళ, హిందీ ఫస్ట్ గ్లింప్స్ లో కామన్ గా పవన్ కళ్యాణ్ మరాఠీ డైలాగ్స్ ఉన్నాయి. అసలు పవన్ కళ్యాణ్ మరాఠిలో మాట్లాడటం వెనుక పెద్ద కథే ఉండే సూచనలు కలవు. ముంబైలో మరాఠీ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ. మరాఠా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వ్యక్తిగా పవన్ కనిపించే అవకాశం కలదు.
ఓజీ అంటే ఓజాస గంభీర అని అర్థం అట. అది పవన్ కళ్యాణ్ పేరు. మరి ఇది నార్త్ ఇండియన్స్ పేరునే తలపిస్తుంది. ఓజాస అంటే అటు జపనీస్ పేరు వలె ఉంది. ఓజీ కథలో ముంబై, జపాన్ ప్రధాన నేపద్యాలుగా తెలుస్తుంది. అదే సమయంలో సాహో చిత్రంతో కూడా సుజీత్ లింక్ పెట్టాడు. గ్లింప్స్ లో వాజీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని రాసి ఉన్న కంటైనర్స్ మనం చూడవచ్చు. కల్పిత వాజీ నగరాన్ని సాహో చిత్రంలో గ్యాంగ్ స్టర్ సిటీగా చూపించిన విషయం తెలిసిందే.

