Game Changer Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్… ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ నటుడు ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ‘గేమ్ చేంజర్’ సినిమాతో ఇప్పుడు ఆయన భారీ సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ‘త్రిబుల్ ఆర్’ సినిమా వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికి ఆయన నుంచి మరొక సినిమా రాలేదు అంటూ యావత్తు ఇండియన్ సినిమా అభిమానులంతా ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో గేమ్ చేంజర్ సినిమాను రంగం లోకి దింపుతున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కొద్దిసేపటికి క్రితమే రిలీజ్ చేశారు. ఇక దాంతో ఆ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ సినిమా మామూలు సినిమా కాదు మెగా పవర్ స్టార్ యొక్క స్టార్ డమ్ మొత్తాన్ని పెంచబోతున్న సినిమా అనేది మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ ను కనక మనం గమనిస్తే మొదట రామ్ చరణ్ వాయిస్ తో ఒక డైలాగు నుంచి ట్రైలర్ ను ఓపెన్ చేశారు… ఇక ఆ డైలాగ్ ఏంటి అంటే ‘100 ముద్దుల్ని తినే ఏనుగు ఒక్క ముద్దని వదిలేసిన కూడా అది లక్ష చీమలకి ఆహారం అవుతుంది. ఆ ఒక్క ముద్ద కోసమే నేను ఈ ఫైట్ చేస్తున్నాను’ అంటూ ఆయన చెప్పిన డైలాగు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ అయితే క్రియేట్ చేసింది… ఇక ఈ సినిమాలో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. కాబట్టి ఆ ఒక్క డైలాగ్ తోనే ఈ సినిమా మొత్తాన్ని లైనప్ చేసినట్టుగా తెలుస్తోంది.
పేదల పక్షాన నిలబడి పేదలకు అండగా ఉండాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్న ఐఏఎస్ ఆఫీసర్ మీద పొలిటిషియన్స్ యొక్క పవర్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం గా ఈ సినిమాను చేసినట్టుగా తెలుస్తోంది. కానీ వాటన్నింటినీ తిప్పికొడుతూ ఆయన జనాలను ఎలా రక్షించాడు అనేది ఈ సినిమా కథగా మనకు చాలా క్లారిటీగా తెలుస్తోంది…
ఇక ఎస్ జె సూర్య ఈ సినిమాలో మినిస్టర్ గా ఉండి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మారినట్టుగా కూడా ఈ ట్రైలర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది… ఇక జనం పక్షాన నిలిచిన రామ్ చరణ్ జనం కోసం ఏం చేశాడు ఆ ముఖ్యమంత్రి భారీ నుంచి జనాన్ని ఎలా రక్షించాడు ఎవరెవరు ఎలాంటి స్కామ్ లను చేశారు అనేది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ విజువల్స్ తో అయితే నింపేశారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ జాతర చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక శంకర్ కూడా మొదటి సారి నేను రామ్ చరణ్ తో మాస్ సినిమా చేశాను అంటూ ఒక ఈవెంట్ లో చెప్పాడు.
ఇక హెలికాప్టర్ లో నుంచి రామ్ చరణ్ కత్తి తీసుకొని బయటికి రావడం అనేది నెక్స్ట్ లెవెల్ షాట్ అనే చెప్పాలి… మొత్తానికైతే ఈ సినిమాతో విజువల్ వండర్ ను మనకు అందించే ప్రయత్నంలో శంకర్ చాలా వరకు సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మాత్రం ఈ నెల 10వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…