Vishwak Sen: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోలలో ఒకడు విశ్వక్ సేన్. ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఆయన, మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడమే కాకుండా, మంచి క్రేజ్ ని కూడా సంపాదించుకున్నాడు. అయితే చాలా మంది విశ్వక్ సేన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చాడని అనుకుంటూ ఉంటారు. కానీ విశ్వక్ సేన్ తండ్రి చిన్న మనిషి కాదు అని మొన్న విశ్వక్ సేన్ చెప్తే కానీ జనాలకు తెలియలేదు. చిరంజీవి తో మా నాన్న గారికి మంచి సాన్నిహిత్యం ఉందని, ఆయన ప్రజారాజ్యం పార్టీ నుండి మలక్ పేట స్థానం నుండి ఎమ్మెల్యే గా పోటీ కూడా చేసాడని చెప్పుకొచ్చాడు.
విశ్వక్ సేన్ చెప్పిన ఈ మాటల తర్వాత అభిమానులు ఎవరు ఇతని తండ్రి అని గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. అలా వెతికిన తర్వాత అతని తండ్రి పేరు కరాటీ రాజు అని తెలిసిందే. ఈయన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2009 వ సంవత్సరంలో మలక్ పేట స్థానం నుండి పోటీ చేయగా, ఆయనకు 5 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పట్లో ఈయన కోసం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించాడు. అయితే ముస్లిమ్స్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో AIIMM పార్టీ అభ్యర్థి అహమ్మద్ బిన్ అబ్దుల్లా గెలుపొందాడు. ఇక తర్వాతి స్థానం లో టీడీపీ పార్టీ అభ్యర్థి నిలవగా, మూడవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నాల్గవ స్థానం లో బీజేపీ పార్టీ అభ్యర్థి, ఐదవ స్థానంలో లోక్ సత్తా పార్టీ అభ్యర్థి, ఆరవ స్థానం లో ప్రజా రాజ్యం పార్టీ అభ్యర్థి కరాటీ రాజు(విశ్వక్ సేన్ తండ్రి) నిలిచాడు.
ఇది ఇలా ఉండగా ఈ నెల 14వ తేదీన విశ్వక్ సేన్ హీరో గా నటించిన లైలా చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్,పాటలకు సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత అడల్ట్ రేటెడ్ కామెడీ ఎంటర్టైనర్ అని అందరికీ అర్థమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎల్లుండి హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్లాన్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. నేడు విశ్వక్ సేన్ మెగాస్టార్ చిరంజీవి ని కలిసి ఆయన మేడలో గజమాల వేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాల్సిందిగా కోరాడు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మరి ఈ ఈవెంట్ కి విశ్వక్ సేన్ తండ్రి కూడా వస్తాడో లేదో చూడాలి.