https://oktelugu.com/

Game Changer Song: గేమ్ చేంజర్ పాటను తమన్ ఆ సూపర్ హిట్ సాంగ్ నుంచి కాపీ చేశాడనే విషయం మీకు తెలుసా..?

శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో కనక ఆయన సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరోసారి బాలీవుడ్ లో తన జెండా ఎగరవేస్తాడు.

Written By:
  • Gopi
  • , Updated On : May 9, 2024 / 11:45 AM IST
    Thaman copied the Game Changer song from that super hit song

    Thaman copied the Game Changer song from that super hit song

    Follow us on

    Game Changer Song: మెగా పవర్ స్టార్ గా తన పవర్ ఏంటో చూపిస్తూ ఇండియాలో ఉన్న అభిమానులందరినీ ఆకర్షిస్తూ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన నటుడు రామ్ చరణ్.. ఇక ఈయన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా వచ్చిన తర్వాత ఆచార్య సినిమాలో కొద్దిసేపు కనిపించినప్పటికీ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.

    అయితే ఇప్పుడు ఆయన శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో కనక ఆయన సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరోసారి బాలీవుడ్ లో తన జెండా ఎగరవేస్తాడు. ఇక లేదు అంటే మాత్రం ఆయన మార్కెట్ మరింత డౌన్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాని లేటుగా తీసుకొచ్చిన పర్లేదు కానీ సూపర్ సక్సెస్ అయ్యే విధంగా మలచాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా కోసం డైరెక్టర్ శంకర్ గాని, రామ్ చరణ్ గానీ ఎక్కువ టైం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

    అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ‘జరగండి ‘ అనే సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సాంగ్ వచ్చిన వెంటనే ఈ సాంగ్ కాఫీ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే వచ్చాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఒక్కొక్కరు ఈ సాంగ్ ని ఒక్కో సాంగ్ నుంచి కాపీ చేశాడు అంటూ విపరీతమైన కామెంట్లైతే చేశారు.

    ఇక నిజానికైతే ఈ సాంగ్ ను అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎన్టీయార్ హీరోగా, మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమాలోని “గుచ్చం గుచ్చం గుచ్చంగి” అనే సాంగ్ నుంచి కాపీ చేసినట్టుగా చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. అయితే ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించాడు. ఇక ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయినప్పటికీ, సాంగ్స్ మాత్రం సూపర్ సక్సెస్ సాధించాయి. ఇక మొత్తానికైతే తమన్ తన గురువు అయిన మణిశర్మ సాంగ్ ను కాపీ చేసి దొరికిపోయాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది..