https://oktelugu.com/

Sirivennela Family: సిరివెన్నెల కుమారులు ఇద్దరు ఇండస్ట్రీలోనే ఉన్నారని మీకు తెలుసా?

Sirivennela Family: సినీ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యం కారణంగా మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.ఇక ఆయన అకాల మరణం పట్ల సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.ఇక ఈయన మృతి పట్ల కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 1, 2021 / 10:59 AM IST
    Follow us on

    Sirivennela Family: సినీ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యం కారణంగా మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.ఇక ఆయన అకాల మరణం పట్ల సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.ఇక ఈయన మృతి పట్ల కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

    Sirivennela Family

    Also Read: సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించి కంటతడి పెట్టిన బాలయ్య
    ఇకపోతే సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం విషయానికి వస్తే ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరూ ఇండస్ట్రీలోని ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారన్న విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. సీతారామ శాస్త్రి భార్య పద్మావతి ఆయన కుమారులు రాజా, యోగేష్ ఉన్నారు.ఈ ఇద్దరు కుమారులు కూడా తన తండ్రి స్ఫూర్తితోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు పొందారు.

    ఇక సినిమా ఇండస్ట్రీలోకి పెద్దబ్బాయి యోగేశ్వర్ కుదిరితే కప్పు కాఫీ సినిమాతో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాగే రంగు వంటి పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇక ఈయన చిన్న కుమారుడు రాజా నటుడిగా వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఈయన రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సీతారామశాస్త్రి ఇద్దరు కొడుకులు కూడా ఇండస్ట్రీలో ఉంటూ మంచి గుర్తింపు పొందారని చెప్పవచ్చు.

    Also Read: సిరివెన్నెలకు ఘన నివాళి అర్పించిన గూగుల్… ఎమోషనల్ ట్వీట్