Yellamma movie updates: ఇండస్ట్రీ లోకి రావాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరు లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తుంటారు అని అందరు అనుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారు అనేది ఎవ్వరు ఆలోచించారు. ఇక్కడ ఎదురయ్యే కష్టాలను తట్టుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు సాగిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు నిలబడగలుగుతారు. అలాగే వాళ్ళు మాత్రమే స్టార్లుగా ఎదుగుతారు. నిజానికి ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆశా మాశీ వ్యవహరమైతే కాదు. ఇక్కడ ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన వరుసగా డిజాస్టర్లను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నటుడిగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఆ తర్వాత దర్శకుడిగా మారి బలగం లాంటి గొప్ప సినిమా చేశాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా చాలా మంది హీరోల పేర్లు వినిపించినప్పటికి వాళ్ళందరూ కూడా సినిమా నుంచి తప్పకుంటున్నారు.
ఇప్పటికే ఆరుగురు హీరోలు ఈ సినిమా నుంచి తప్పుకోవడం విశేషం… దాంతో ఇప్పుడు ఒక యంగ్ హీరోతో ఈ సినిమాని తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో వేణు ఎల్దండి ఉన్నట్టుగా తెలుస్తోంది. మ్యాడ్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నార్ని నితిన్ ను ఈ సినిమాలో భాగం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ బామ్మర్ది గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన మ్యాడ్ సినిమాతో తనకంటూ ఒక సపరేట్ స్టైల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆయ్ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకొని తనదైన రీతిలో సత్తా చాటాడు. కాబట్టి ఆయనతో సినిమా చూస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి అతను ఆ సినిమాకు సెట్ అవుతాడా? లేదా అనేది కూడా చూసుకోవాలి అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా లో నార్ని నితిన్ ను ఫైనల్ చేస్తారా లేదా ఈయనను కూడా మళ్లీ మార్చే ప్రయత్నం ఏదైనా చేస్తారా? అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…