Vishnupriya: సినీ ఇండస్ట్రీలో వారి లైఫ్ స్టైల్ ను చూసి ప్రతి ఒక్కరు లైఫ్ అంటే వారిలా ఉండాలి అనుకుంటారు. లగ్జరీని మాత్రమే చూస్తారు గానీ వారు పడుతున్న బాధలు చాలా మందికి తెలియవు. బతుకు చిత్రం ప్రతి ఒక్కరికి ఒకేలా ఉంటుంది. కానీ పరిస్థితులే కాస్త భిన్నంగా ఉంటాయి. సమస్యలు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి అని అనుకోకుండా మాకు మాత్రమే ఈ పరిస్థితి అంటూ బాధ పడుతుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి ఎన్నో కష్టాలు ఉన్నాయి. వాటిని దాటుకుంటూ వస్తుంటారు. అంతేకాదు అందనంత ఎత్తుకు కూడా ఎదుగుతారు. ఇలానే ఎదిగింది యాంకర్ విష్ణుప్రియ.
జర్నలిస్ట్ గా తన కెరీర్ ను స్టాట్ చేసి ఆ తర్వాత యూట్యూబర్ గా గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత సుడిగాలి సుదీర్ తో కలిసి పోవే పోరా అనే టీవీ షోతో మంచి క్రేజ్ సంపాదించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా కొన్ని ఈవెంట్లలో కనిపించి మరింత దగ్గరైంది. అలాగే ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్, చెక్ మేట్, వాంటెడ్ పండుగాడు అనే సినిమాల్లో నటించి మరింత గుర్తింపు సంపాదించింది.
రీసెంట్ గా మైవిలేజ్ షోతో కలిసి డిన్నర్ చేసిన విష్ణు తన ఫ్యామిలీ గురించి కష్టాల గురించి తెలియజేసింది. తన అమ్మానాన్నలది చీరాలలోని బాపట్ల అని.. తను మాత్రం చెన్నైలో పుట్టాను అని తెలిపింది. అయితే విష్ణుకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే హైదరాబాద్ కు వచ్చిందట వీరి ఫ్యామిలీ. అయితే నంబర్ వన్ యారీ లో కనిపించినప్పుడు చాలా సన్నగా ఉన్నానని తెలిపింది. దానికి కారణం ఆమె తినకపోవడమే అంటూ బాధ పడింది. తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అంటూ తెలిపింది. అంతే కాదు ఇప్పుడు కాస్త డబ్బులు సంపాదించి ఆర్డర్స్ పెట్టుకున్నా అంటూ ఫన్నీగా చెప్పింది విష్ణు.