Akhil Akkineni rejected movies: సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్లు చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి ఇప్పుడున్న అఖిల్ వరకు ప్రతి ఒక్క హీరో కూడా వాళ్ళను వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. ఆ ఫ్యామిలీకి గొప్ప గుర్తింపు ఉండడంతో ప్రేక్షకుల్లో కూడా విశేషమైన ఆదరణ సంపాదించుకున్నారు. ఇక ఇలాంటి స్టార్ హీరోలు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్లను వాళ్ళు ఎలివేట్ చేసుకోవాలంటే మరింత పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ లను ఎంచుకోవాలి. పాన్ ఇండియాలో వాళ్ళని మించిన నటులు మరెవరు లేరు అనేంతలా ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలంటే స్క్రిప్ట్ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అఖిల్ చేయాల్సిన రెండు సినిమాలను అనవసరంగా వదులుకున్నాడు. ఆ సినిమాలను చేసిన ఇతర హీరోలు స్టార్ హీరోలుగా మారారు. ఆ రెండు సినిమాలు ఏంటంటే అందులో ఒకటి నాని హీరోగా వచ్చిన దసర సినిమా కాగా, మరొకటి కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన క సినిమా కావడం విశేషం…
ఈ రెండు స్టోరీలు మొదట అఖిల్ దగ్గరికి తీసుకెళ్లినప్పటికి ఆయన ఆ దర్శకుల మీద నమ్మకం లేక ఆ కథలను రిజెక్ట్ చేశాడు. ఫైనల్ గా సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. ఇక అక్కినేని హీరో ప్రస్తుతం ఒక్క సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన లెనిన్ సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమాతో అయిన సక్సెస్ సాధిస్తే పర్లేదు లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా డౌన్ ఫాల్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఈయన ఇంతకుముందు చేసిన ఏజెంట్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్న ఆయన చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా అయిన అతనికి సక్సెస్ ని కట్టబెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక అఖిల్ ఇండస్ట్రీ వచ్చి 10 సంవత్సరాలు గడుస్తోంది ఇప్పటికే ఆయన తోటి హీరోలు టాప్ పొజిషన్ కి వెళ్తున్నారు…కాబట్టి ఆయన మీద చాలా ప్రేజర్ ఉంది..కాబట్టి ఆయన ఎంత పెద్ద సక్సెస్ కొడితే ఆయనకి అంత బెనిఫిట్ అవుతోంది…