https://oktelugu.com/

Adipurush Audience Response: ఆదిపురుష్ లో నటించిన హీరో, దర్శకుడు, ప్రొడక్షన్ హౌస్ అనుకున్నది రీచ్ అయ్యారా? ఆడియన్స్ స్పందన!

సీత పాత్ర కూడా విమర్శల పాలవుతుంది. లంకలో బంధించబడిన సీతను కొన్ని సన్నివేశాల్లో పై వస్త్రము లేకుండా చూపించారని నెటిజెన్స్అభిప్రాయం . కేవలం చీర కొంగుతో ఎద భాగం దాచుకున్నట్లు జానకిని చూపించారు. ఇది వివాదాస్పదం అవుతుంది.

Written By: Shiva, Updated On : June 17, 2023 11:18 am
Adipurush Audience Response

Adipurush Audience Response

Follow us on

Adipurush Audience Response: టాక్ తో సంబంధం లేకుండా ఆదిపురుష్ భారీ వసూళ్లు రాబట్టింది. డే వన్ వరల్డ్ వైడ్ వసూళ్లు వంద కోట్లకు పైమాటే. అయితే ఆదిపురుష్ మూవీ టీం తాము కోరుకున్నది సాధించారా? అంటే సందేహాలు తలెత్తక మానవు. ఆదిపురుష్ మూవీ ఒక సాహసం. రామాయణగాథ అనగానే పోలికలు సహజం. ముఖ్యంగా దర్శకుడు, హీరో, హీరోయిన్ మీద ఒత్తిడి తెస్తుంది. రాముడు పాత్రను పలువురు నటులు పోషించారు. వారిలో కొందరు బెస్ట్ అనిపించుకున్నారు. టాలీవుడ్ వరకైతే ఎన్టీఆర్ రోల్ మోడల్ గా ఉన్నారు. లవకుశతో పాటు కొన్ని చిత్రాల్లో ఆయన రామునిగా నటించారు. శోభన్ బాబు, బాలకృష్ణ, సుమన్ తో పాటు అనేక మంది హీరోలు రామునిగా నటించి మెప్పించారు.

మరి ప్రభాస్ పరిస్థితి ఏంటీ? ప్రేక్షకులు రామునిగా ప్రభాస్ ని అంగీకరించారా? అంటే సందేహమే. అందులోనూ సాంప్రదాయానికి భిన్నంగా రాముడిని ప్రజెంట్ చేశాడు ఓం రౌత్, మీసాలతో కొంచెం మాస్ గెటప్ లో చూపించారు. రామాయణంలో రాముడిని వాల్మీకీ మొత్తంగా వర్ణించారు. నీలమేఘ శ్యాముడు అన్నాడు. అంటే రాముడు నీలి రంగు వర్ణంలో ఉండేవాడట. చాలా చిత్రాల్లో రాముడిని దర్శకులు అలానే చూపించారు. ఓం రౌత్ దాన్ని అనుసరించలేదు. ప్రభాస్ లో రాముడు కనిపించలేదు, ఒకింత కర్ణుడు మాదిరి తోచాడని పలువురు అభిప్రాయ పడ్డారు. కాబట్టి ఈ తరం హీరోల్లో రాముడి పాత్ర చేసిన హీరోగా కీర్తి గడించాలన్న ప్రభాస్ కోరిక తీరలేదు.

సీత పాత్ర కూడా విమర్శల పాలవుతుంది. లంకలో బంధించబడిన సీతను కొన్ని సన్నివేశాల్లో పై వస్త్రము లేకుండా చూపించారని నెటిజెన్స్అభిప్రాయం . కేవలం చీర కొంగుతో ఎద భాగం దాచుకున్నట్లు జానకిని చూపించారు. ఇది వివాదాస్పదం అవుతుంది. సీతమ్మతల్లిని ఇలా చూపించడం సహించరాని నేరం అంటున్నారు. అలా లంకేశ్వరుడు గెటప్, ఆ పాత్రకు పెట్టిన కొన్ని సన్నివేశాలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. కిరీటం, శివనామాలు, చేతిలో ఆయుధం, పట్టువస్త్రాలు, నగలు… రావణుడు గెటప్ అంటే గుర్తుకు వచ్చేది ఇవి.

అందుకు భిన్నంగా సైఫ్ అలీ ఖాన్ ని స్టైలిష్ హెయిర్ కట్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో హాలీవుడ్ చిత్రాల విలన్ లా చూపించారు. ఆదిపురుష్ అసలు రామాయణమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రధాన పాత్రలు చేసిన ప్రభాస్, కృతి సనన్, సైఫ్ కోరిక అయితే నెరవేరలేదు. ఓ గొప్ప చిత్రంలో మరపురాని పాత్ర చేశామన్న సంతృప్తి దక్కలేదు. ఇక నిర్మాతల విషయానికి వస్తే థియేట్రికల్, డిజిటల్ రైట్స్ రూపంలో భారీగానే రాబట్టారు. ఒక్క ఓటీటీ హక్కుల ద్వారా రూ. 150 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఐదు వందల కోట్లు పెట్టినప్పటికీ నిర్మాతలు సేఫ్. అదే సమయంలో సినిమా అవుట్ ఫుట్ చూశాక అంత బడ్జెట్ పెట్టారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆదిపురుష్ విషయంలో నిర్మాతల ప్రణాళిక మాత్రం ఫలించింది. ప్రభాస్ మాత్రం భారీగా ఇమేజ్ కోల్పోయాడు.