Homeఎంటర్టైన్మెంట్Actress Aamani: అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చేదాన్ని... చిరంజీవి కారణంగా హీరోయిన్ ఆమని అంత వేదనకు గురైందా!

Actress Aamani: అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చేదాన్ని… చిరంజీవి కారణంగా హీరోయిన్ ఆమని అంత వేదనకు గురైందా!

Actress Aamani: 90లలో స్టార్ హీరోయిన్ గా హవా సాగించింది కన్నడ భామ ఆమని. ఆమె నటన చాలా సహజంగా ఉండేది. జంబలకిడి పంబ, మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం చిత్రాల్లో ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. అయితే స్టార్ హీరోల పక్కన ఆమెకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. బాలకృష్ణ, నాగార్జునలతో మాత్రం ఒకటి రెండు చిత్రాలు చేసింది. కాగా సుదీర్ఘ కెరీర్లో ఆమెకు చిరంజీవితో జతకట్టే ఛాన్స్ రాలేదు. అయితే చిరంజీవి పక్కన ఆమెకు ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిందట.

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన శుభలగ్నం బ్లాక్ బస్టర్ హిట్. హీరోయిన్ డబ్బు కోసం మొగుడిని అమ్ముకోవడం అనే కాన్సెప్ట్ గతంలో ఎవరూ టచ్ చేయనిది. ఆ పాయింట్ ని ప్రధానంగా తీసుకుని ఎస్వీ కృష్ణారెడ్డి శుభలగ్నం చిత్రాన్ని కామెడీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాడు. జగపతిబాబు, రోజా, ఆమని ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీ సక్సెస్లో ఆమని పాత్ర ఎంతగానో ఉంది.

ఈ క్రమంలో చిరంజీవి పక్కన ఛాన్స్ వచ్చిందట. దర్శకుడు ఏ కొండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చేస్తున్న రిక్షావోడు చిత్రంలో హీరోయిన్ గా ఆమనిని సంప్రదించారట. చిరంజీవి అంటే ఆరాధించే ఆమని ఆయన పక్కన హీరోయిన్ ఛాన్స్ అనగానే ఎగిరి గంతేసి ఒప్పుకుందట. డేట్స్ కూడా ఇచ్చిందట. చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడిందట. త్వరలో షూటింగ్ లో కలుద్దాం అన్నారట.

Also Read: Bigg Boss Priyanka: నిస్సిగ్గుగా అతడితో సహజీవనం చేస్తున్న బిగ్ బాస్ ప్రియాంక… విలువలు వదిలేశారుగా!

కొద్దిరోజుల తర్వాత రిక్షావోడు సినిమాలో నగ్మా హీరోయిన్ అని పేపర్లో న్యూస్ వచ్చిందట. నా స్థానంలో నగ్మా అంటున్నారు. ఒకసారి కనుక్కో అని మేనేజర్ కి చెప్పిందట. డైరెక్టర్ మారాడు మేడం. కోదండరామిరెడ్డికి బదులు కోడి రామకృష్ణ రిక్షావోడు సినిమా చేస్తున్నారు. అందుకే హీరోయిన్ ని మార్చేశారు… అని చెప్పాడట. దాంతో ఆమని తీవ్ర నిరాశకు గురైందట. కొన్నాళ్ల తర్వాత చిరంజీవికి సిస్టర్ రోల్ కోసం సంప్రదించారట. పదిసార్లు అడిగినా సిస్టర్ రోల్ చేయనని ఆమని తెగేసి చెప్పిందట.

Also Read: Jr NTR: పెళ్లి కి ముందు ఆ హీరోయిన్ తో ఎఫైర్ నిజమే… ఓపెన్ గా లవ్ మేటర్ బయటపెట్టిన ఎన్టీఆర్!

చిరంజీవి పక్కన ఛాన్స్ మిస్ అయ్యానని గుర్తుకు వచ్చిన ప్రతిసారి ఆమని ఏడ్చేదట. స్టాలిన్ సినిమాలో సిస్టర్ రోల్ చేయమంటే చేయను అని చెప్పిందట. తన డ్రీం హీరోకి సిస్టర్ గా ఊహించుకోలేకపోయానని ఆమని అన్నారు. ఆయనతో సినిమా చేయకపోయినా ఓ సందర్భంలో ఫోటో దిగే ఛాన్స్ వచ్చిందని ఆమని చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular