Sreemukhi: బుల్లితెర వ్యాఖ్యాతల్లో శ్రీముఖి స్థానమే వేరు. ఆమె అందంతో అదరగొడుతోంది. మాటలతో అందరిని మంత్రముగ్దులను చేస్తోంది. సుమ తరువాత అంతటి క్రేజీ సంపాదించుకున్న యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా రష్మి కూడా పోటీలో ఉన్నా శ్రీముఖిలా రెచ్చిపోయి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేయడంలో శ్రీముఖి స్టైలే వేరు. తన అందంతో కాకుండా మాటలతో కూడా మంత్రాంగమే చేస్తోంది. దీంతో అభిమానులు శ్రీముఖిని ఆరాధిస్తున్నారు. బుల్లితెరలో శ్రీముఖి లాంటి వ్యాఖ్యాత లేదనే వాదనలు సైతం తెస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు చురుకుగా ఉంటూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

రష్మి, అనసూయను వెనక్కి నెట్టి తానే ముందంజలో నిలుస్తోంది. పలు షోల్లో తన మాటలతో ఆకట్టుకుంటోంది. దీంతో ఈటీవీలో జాతిరత్నాలు, జెమినీ టీవీలో డాన్స్ ఐకాన్ కు జడ్జిగా వ్యవహరిస్తోంది. దీనికి ఓంకార్ వ్యాఖ్యాతగా ఉండటం గమనార్హం. ఈ షోలో శ్రీముఖి వేసుకున్న డ్రెస్ అందరిని ఆకర్షిస్తోంది. బ్లాక్ ఇన్నర్ లో రెడ్ సూట్ వేసుకుని ఎద అందాలు కనిపించేలా శ్రీముఖి చేసిన అల్లరితో కుర్రకారు మతి పోతోంది. శ్రీముఖి ఇలా రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు. ఈ షో కోసమే అలా రెడీ అయిందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. రెచ్చిపోయి తన అందాలను ఆరబోస్తుంటే అభిమానులు గుక్కతిప్పుకోవడం లేదు.
శ్రీముఖి బుల్లితెరతోపాటు వెండితెరలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం యాంకర్లలో అగ్రగామిగా నిలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో తన అందాలను కూడా ప్రదర్శిస్తోంది. దీంతో ఆమెకు ఫాలోవర్స్ పెరుగుతున్నారు. తాజాగా ఆమె పోస్టు చేసిన పిక్ తో పిచ్చెక్కిపోతున్నారు. మనిషికి మందమే అందమన్నట్లు అందానికే అందంగా అభివర్ణిస్తున్నారు. శ్రీముఖి అందాలను తనివితీరా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె తన ప్రస్థానాన్ని కొనసాగించడంలో ఆమె అందం కూడా ప్లస్ అవుతోంది.

శ్రీముఖి ట్రెండింగ్ ఇలాగే కొనసాగితే స్టార్ హీరోయిన్లను మించిపోయే అవకాశముంది. తన అభిమానులు పెరుగుతున్నారు. కానీ ఆమె డ్రెసింగ్ చూసి అవాక్కవుతున్నారు. శ్రీముఖి డబ్బుల కోసం ఇంతకు తెగిస్తావా అంటూ కొందరు నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. కానీ వాటిని పట్టించుకోవడం లేదు. తన కెరీర్ ముఖ్యం కానీ వారి కామెంట్లు కాదనే ధోరణిలో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి శ్రీముఖి అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనకాడటం లేదు. మనం పైకి వెళ్లాలంటే కొన్నింటిని వదిలేయాలనే ధోరణితోనే ఇలా చేస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.