Sekhar Kammula: సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం..ఇక్కడ సక్సెస్ ఉన్నంత కాలం మాత్రమే విలువ ఉంటుంది..సక్సెస్ లేకపోతే ఎంత ఎత్తుకి ఎడిగావో అంతే లోతుకి దిగజారిపోతావు అంటూ ఇండస్ట్రీ లో అలాంటి అనుభవాలు ఎదురైనా వాళ్ళు చెప్తూ ఉండే మాట..వాళ్ళు చెప్పిన ఆ మాటలు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ విషయం లో కూడా జరిగాయి..ఇప్పుడు అదే సంఘటన సాయి పల్లవి లాంటి క్రేజీ హీరోయిన్ కి జరిగింది..ఇండస్ట్రీ లో సక్సెస్ కావాలంటే కేవలం అందం ఒక్కటే కాదు..టాలెంట్ కూడా ఉండాలి అని నిరూపించిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు సాయి పల్లవి.

యూత్ లో ఈమెకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు..అందరూ ఈమెని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు..ఫిదా, లవ్ స్టోరీ , MCA ,శ్యామ్ సింఘా రాయ్ ఇలా ఒక్కటా రెండా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు , తమిళం మరియు మలయాళం భాషల్లో ఒక ఊపు ఊపింది..ముఖ్యంగా కుర్రకారులు అయితే సైపల్లవి అంటే వెఱ్ఱితిపోతారు..ఎందుకంటే ఆమె నటన మరియు డాన్స్ అంత ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి..హీరో తో సంబంధం లేకుండా కేవలం సాయి పల్లవి పేరు తో బిజినెస్ జరుపుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి.
అలాంటి సాయి పల్లవి కి గత కొంత కాలం నుండి గడ్డుకాలం ఎదురైంది..ఈమె నటించిన లేటెస్ట్ చిత్రాలు విరాటపర్వం మరియు గార్గి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి..దీనితో సాయి పల్లవి తో ఇప్పుడు సినిమాలు తియ్యడానికి దర్శక నిర్మాతలు సంశయిస్తున్నారు..ఎందుకంటే ఆమె నటిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి..అంతే కాకుండా సినిమాల్లో హీరో పక్కన హీరోయిన్ రోల్స్ కి పెద్ద ప్రాధాన్యత ఉండదు..కేవలం అందాల ఆరబోతకే హీరోయిన్స్ పరిమితం అవుతుంటారు..హీరోయిన్స్ కి నటనకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు రావడం అరుదు..సాయి పల్లవి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుంది..అందుకే ఇప్పుడు ఆమెతో సినిమాలు చెయ్యడానికి డైరెక్టర్స్ కానీ నిర్మాతలు కానీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

ఇక ఫిదా సినిమా సాయి పల్లవి ని తెలుగు తెరకి పరిచయం చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల..ఈయన సాయి పల్లవి పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాడని ఫిలిం నగర్ లో ఒక టాక్ వినిపిస్తుంది..ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల చేసిన లవ్ స్టోరీ లో సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకున్నాడు..ఈ సినిమా సూపర్ హిట్ అయినా తర్వాత ఆయన ధనుష్ తో చెయ్యబోతున్న సినిమాలో కూడా సాయి పల్లవి ని తీసుకున్నాడు..ఆమె ఈ సినిమా కోసం డేట్స్ కూడా ఇచ్చేసింది.
అయితే సాయి పల్లవి ప్రస్తుతం వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉండడం వల్ల ఆమెని సినిమా నుండి తప్పించినట్టు తెలుస్తుంది..తనతో ఒక్కమాట కూడా చెప్పకుండా సినిమా నుండి తీసేసి వేరే హీరోయిన్ ని పెట్టుకోవడం పై సాయి పల్లవి చాలా హర్ట్ అయ్యిందట..ఇది ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు ‘నా’ అనుకున్నోళ్ళు కూడా పట్టించుకోరు అనే దానికి ఈ సంఘటన మరో ఉదాహరణగా నిలిచింది.