Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇక దానికి అనుగుణంగానే ఆయన యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పిస్తూ ముందుకు దూసుకెళుతుండడం విశేషం… ప్రస్తుతం అనిమల్ సినిమాతో ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే రణబీర్ కపూర్ తో చేసిన అనిమల్ సినిమాని ఒక రెండు తెలుగు సినిమాల ఇన్స్పిరేషన్ తో తీసినట్టుగా తెలుస్తోంది.
Also Read: మూడేళ్లు..’ఓజీ’ చిత్రం కోసం సుజిత్ ఎన్ని బాలీవుడ్ ఆఫర్స్ ని వదులుకున్నాడో తెలుసా!
ముందుగా మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా అలాగే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా ఈ రెండింటిలో కూడా తండ్రి సెంటిమెంట్ ని హైలెట్ చేసి సినిమాను తీశారు. మరి బేస్ లైన్ ను ఆధారంగా చేసుకుని సందీప్ రెడ్డివంగ అనిమల్ సినిమా కథ రాసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఆ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి.
దానికి అనుగుణంగానే ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకొని పాన్ ఇండియాలో 900 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది… మూడు సినిమాలకు ఉన్న వేరియేషన్స్ ఏంటంటే దూకుడు సినిమాను కామెడీగా తెరకెక్కించారు. నాన్నకు ప్రేమతో సినిమాని ఎమోషనల్ గా తీశారు. ఇక ఈ సినిమాని మాత్రం వైలెన్స్ తో చెప్పడం వల్ల ఈ సినిమాకు అది బాగా ప్లస్ అయింది.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాల లైన్ ఒకేలా ఉన్నప్పటికీ ట్రీట్ మెంట్ లో సినిమా రూపు రేఖలు మారిపోతూ ఉంటాయి. అందువల్లే సినిమాలు సక్సెస్ లను సాధిస్తూ ఉంటాయి…ఇక సందీప్ చేయబోతున్న ప్రతి సినిమాలో కథ ఎలా ఉన్న కూడా ఆయన మేకింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది…అందుకే ఆయన సినిమాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి…