Samantha Ruth Prabhu: సమంత అరుదైన మయోసైటిస్ వ్యాధికి గురైన విషయం తెలిసిందే. సాధారణంగా ఈ రుగ్మత 5 నుండి 15 వయసున్న పిల్లలకు లేదా 45 ఏళ్ళు పైబడిన వారికి సోకుతుంది. కానీ థర్టీ ప్లస్ లో ఉన్న సమంత దీని బారిన పడడంతో కారణాలు ఏమిటనే ఆసక్తి అందరిలో నెలకొంది. కొందరి అంచనా ప్రకారం సమంత కెరీర్ కోసం చేసిన కొన్ని తప్పులు, అలాగే మానసిక వేదన ఈ సమస్యకు దారితీశాయి అంటున్నారు. ఆటో ఇమ్మ్యూన్ కారణంగా కండరాల్లో ఏర్పడే సమస్యనే మయోసైటిస్ అంటారు.

విడాకులకు కారణంగా సమంత డిప్రెషన్ కి గురయ్యారు. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నపుడు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అవి కొన్ని రుగ్మతలకు కారణమవుతాయి. అలాగే సమంత చేసిన మితిమీరిన వ్యాయామం ఆరోగ్యాన్ని దెబ్బతీసింది అంటున్నారు. గంటల తరబడి చేసిన వ్యాయామం, శక్తికి మించి ఎత్తిన బరువులు కండరాలపై ప్రతికూల ప్రభావం చూపాయి అంటున్నారు. పరిమితికి మించి సమంత జిమ్ చేయడం కండరాల వాపుకు దారి తీసిందని అంచనా వేస్తున్నారు.
ది ఫ్యామిలీ మాన్ సిరీస్ కోసం సమంత జీరో సైజులోకి మారారు. హెవీ వర్క్ అవుట్స్ చేశారు. సిరీస్ విడుదలైనా సమంత బరువులు ఎత్తడం వంటి కఠిన వ్యాయామాలు మానలేదు. సమంత ఎంతగా జిమ్ లో కష్టపడేవారో ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసే వీడియోలు, ఫొటోలే నిదర్శనం. ఆమెకు వరుసగా యాక్షన్ తో కూడిన వెబ్ సిరీస్లలో నటించే అవకాశం దక్కుతుంది. దీంతో జీరో సైజ్ బాడీ మైంటైన్ చేయడం కోసం సమంత అధిక సమయం వ్యాయామానికి కేటాయించారు.

ఇక మయోసైటిస్ లో అనేక రకాలు ఉన్నాయి. సమంతకు సోకిన వ్యాధి ఎలాంటిదో ఆమె వెల్లడించలేదు. సమంత వయసు రీత్యా చికిత్సతో ఆమె త్వరగా కోలుకుంటుందని అందరూ భావిస్తున్నారు.ప్రస్తుతం ఆమె సిరీస్లు, సినిమాలతో బిజీ ఉన్నారు. నవంబర్ 11న యశోద విడుదల కానుంది. శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. విజయ్ దేవరకొండకు జంటగా చేస్తున్న ఖుషి చిత్రీకరణ దశలో ఉంది.