Ravi Teja Love Story: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకొని ఒక స్టార్ హీరో గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోలలో ఒకరు మాస్ మహారాజా రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ హీరో గా అడపాదడపా సినిమాలు చేస్తూ, అలా నెట్టుకొస్తున్న రోజుల్లో ‘ఇడియట్’ అనే సినిమా ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి హీరో గా స్థిరపడిపోయిన నటుడు ఆయన.
ఆ చిత్రం తర్వాత ఆయన కెరీర్ లో ఎన్నో హిట్లు , సూపర్ హిట్లు మరియు బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఒక చిన్న క్యారక్టర్ ఆర్టిస్టు స్థాయి నుండి, టాలీవుడ్ టాప్ లీడింగ్ స్టార్ హీరోలలో ఒకడిగా ఎదిగే వరకు రవితేజ సినీ ప్రయాణం ప్రతీ ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయం అనే చెప్పొచ్చు.
అయితే సినీ రంగం లోకి అడుగుపెట్టిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరోకి అయినా రూమర్స్ తప్పవు. అలా రవితేజ మీద కూడా ఆరోజుల్లో ఒక రూమర్ జోరుగా ప్రచారం అయ్యేది. అదేమిటంటే ఆయన ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క తో డేటింగ్ చేస్తున్నాడని, వీళ్లిద్దరు ముంబై లోని ఒక ప్రముఖ రిసార్ట్ లో ఉంటూ కెమెరాలకు చిక్కారని అప్పట్లో ఒక రూమర్ ఇండస్ట్రీ లో సంచలనం గా మారింది. ఈ రూమర్ అప్పట్లో బాగా వ్యాప్తి చెందడం తో రవితేజ ఇంట్లో కూడా దీని మీద పలుమార్లు చర్చలు నడిచి గొడవలు కూడా అయ్యాయట.
అయితే ఈ రేంజ్ లో ఆ రూమర్ వ్యాప్తి చెందడానికి కారణం, ఒకానొక ఇంటర్వ్యూ లో రవితేజని మీకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడగగా, ఆయన దానికి సమాధానం గా అనుష్క పేరు చెప్తాడు, అంతే కాకుండా అనుష్క తనకి ఎంతో మంచి స్నేహితురాలు, నాకు చాలా ఇష్టం అని అన్నాడు. అక్కడి నుండి మొదలైంది అసలు రచ్చ అని అంటున్నారు విశ్లేషకులు.