Rana Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించడమే కాకుండా యూత్ లో సైతం గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్నాడు… మాస్ సినిమాలలో నటించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. అలాంటి వెంకటేష్ గత 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ అన్న కొడుకు అయిన రాణా సైతం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే రానా హీరోగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ పాత్రలను చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. రానా ఎందుకు హీరోగా నిలబడలేకపోయాడనే విషయంలో చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు…శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రానా ఆ తర్వాత చేసిన సినిమాలతో సక్సెస్ లను సాధించలేకపోయాడు…
తర్వాత రానా ఎలాంటి సినిమాలు చేయాలనే విషయం మీద వెంకటేష్ చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఆ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. రానా సినిమాల లిస్టుని వెంకటేష్ దగ్గరుండి మరి చూశారట. ఒకరకంగా వెంకటేష్ చేయడం వల్లే రానా స్టార్ హీరోగా మారలేకపోయాడు అంటూ కొంతమంది చెబుతూ ఉంటారు.
వెంకటేష్ సెలక్షన్ రానాకి సెట్ అవ్వలేదు అందువల్లే రానా బాలీవుడ్లో సైతం సినిమాలు చేసినప్పటికి అక్కడ కూడా రాణించలేకపోయాడు. రాజమౌళి చేసిన బాహుబలి సినిమాతో విలన్ పాత్రను పోషించిన ఆయన ఆ సినిమాతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు… విలక్షణ నటుడిగా రాణిస్తున్నాడు.
డిఫరెంట్ పాత్ర ఏదైనా ఉంది అంటే చాలు ఆ పాత్రలో రానా నటించడానికి సిద్ధమవుతుంటాడు. తేజ డైరెక్షన్లో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో సైతం నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు… ప్రొడ్యూసర్ గా తనకు నచ్చిన కొన్ని సినిమాలను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…