Rajinikanth-Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో మోహన్ బాబు… ఆయన చేసిన సినిమాలు ఒకప్పుడు అతనికి చాలా మంచి క్రేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి. మొదట్లో విలన్ గా ఇండస్ట్రీకి వచ్చిన ఆయన ఆ తదుపరి హీరోగా మారాడు. ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ – మోహన్ బాబు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్న విషయం మనకు తెలిసిందే. వీళ్ళ ఫ్రెండ్షిప్ కి గుర్తుగా మోహన్ బాబును టాప్ హీరోగా మార్చడానికి రజనీకాంత్ చాలా వరకు కష్టపడ్డాడు. ఒకానొక సందర్భంలో రజినీకాంత్ చేయాల్సిన కొన్ని సినిమాలలో మోహన్ బాబు తో చేయించి మంచి సక్సెస్ లను అందించాలనే ప్రయత్నం చేశాడు.
ప్రస్తుతం రజనీకాంత్ స్టార్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన కూలీ సినిమాతో ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోయినప్పటికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రజనీకాంత్ లాంటి నటుడు ఇప్పటికీ 1000 కోట్లు కలెక్ట్ చేయగలిగే కెపాసిటి ఉండి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు…
ఇక అప్పట్లో రజినీకాంత్ చేయాల్సిన పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి లాంటి సినిమాలను మోహన్ బాబు చేసేలా అతని కోసం రజినీకాంత్ త్యాగం చేసి మోహన్ బాబు చేత ఆ సినిమాలను చేయించాడు. మొత్తానికైతే ఆ సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా మోహన్ బాబుకి చాలా గొప్ప గుర్తింపును కూడా సంపాదించి పెట్టాయి…
మోహన్ బాబు టాప్ హీరోగా ఎదగడానికి తను కూడా చాలా వరకు ప్రయత్నం చేశాడు. ఇక అప్పట్లో వీళ్లిద్దరు ఫ్రెండ్షిప్ ని చూసి చాలామంది స్టార్ హీరోలు సైతం జలసిగా ఫీలయ్యేవారట. ఇప్పటికి రజినీకాంత్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి మోహన్ బాబు వాళ్ళ ఇంట్లోనీ ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి వీళ్ళ బాండింగ్ అనేది ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్ గా కొనసాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…