Rajendra Prasad : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది గొప్ప నటులు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపుని సంపాదించుకోవడమే కాకుండా ఆయనలోని నటన ప్రతిభను బయటకు తీసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు… ఒకప్పుడు హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే ప్రేక్షకుల్లో చెరగని ముద్రను వేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా తనలోని నటన ప్రతిభ ను బయటకు తీసిన ఆయన ఇప్పుడు యావత్ తెలుగు సినిమా అభిమానులందరిని అలరిస్తున్నాడనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లిన స్టార్ హీరో రాజేంద్రప్రసాద్.. నట కిరీటి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా కొన్ని సినిమాల్లో ఏడిపించాడు. అలాంటి ఒక గొప్ప నటుడు తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే రాజేంద్రప్రసాద్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కొంతవరకు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాడట. కెరియర్ స్టార్టింగ్ లో ఒక మూడు నెలల వరకు సరిగ్గా అన్నం కూడా తినకుండా పస్తులు కూడా ఉండేవారట. ఇక అలాంటి సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అని రీసెంట్ గా ఒక పోడ్ కాస్ట్ లో తెలియజేశాడు. ఇక ఇది ఇలా ఉంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గర డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవక్షం దొరకడంతో తను ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నానని చెప్పాడు. తద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి సినిమాలు చేసే అవకాశం వచ్చిందని తెలియజేశాడు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ ని నమ్ముకున్న ఏ ఒక్కరికి ఇండస్ట్రీ అన్యాయం చేయదుని చెబుతూనే తనను తాను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పడం విశేషం.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇక ఒకానొక సమయంలో ఒక సంవత్సరంలో దాదాపు 18 సినిమాల వరకు చేసి మంచి రికార్డును కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇలాంటి రాజేంద్రప్రసాద్ మంచి పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులకు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు..
ఇక ఆయన కెరియర్ లో ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి సినిమాలు ఎవర్ గ్రీన్ సినిమాలుగా నిలిచిపోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన పోషించిన పాత్రలకి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే…
ఇక తన కెరియర్ లో రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, అప్పుల అప్పారావు, ఏప్రిల్ ఒకటి విడుదల, ఆ ఒక్కటి అడక్కు లాంటి సినిమాలు తనలోని కామెడీ మొత్తాన్ని బయటికి తీసి ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా సంపాదించి పెట్టాయి…