Rajamouli Kumbha role: కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న క్రమంలో ఇండియన్ సినిమాలను చేసి అందులో కమర్షియల్టిని ఆడ్ చేసి సూపర్ సక్సెస్ ని సాధించవచ్చు అని నిరూపించిన దర్శకుడు రాజమౌళి… మొదట్లో ఆయన కమర్షియల్ సినిమాలను చేసినప్పటికి ఆ తర్వాత తన రూట్ మార్చి యమదొంగ లో గ్రాఫిక్స్ ని వాడుకుంటూ సినిమాని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇక ఆ తర్వాత మగధీర లాంటి సినిమాలతో విజువల్ వండర్స్ ని క్రియేట్ చేశాడు. ఎప్పుడైతే బాహుబలి చేశాడో అప్పటినుంచి ఆయన రేంజ్ మారిపోయింది. అతను సినిమా కోసం విపరీతంగా కష్టపడుతూ సినిమాని అద్భుతంగా నిలపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు అనే ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమా మీదనే అతని పూర్తి ఫోకస్ ఉంది.
ఈ సినిమాలో ‘కుంభ’ అనే పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు…. ఇక ఈ పాత్రకి చాలా మంచి క్రేజ్ రాబోతోందంటు రాజమౌళి చెబుతుండటం విశేషం… ఎందుకంటే వీల్ చైర్ లో కూర్చొని ప్రపంచాన్ని శాసించాలనే ఉద్దేశ్యంతో ఉన్న కుంభ తను అనుకున్నది ఎలా నెరవేర్చుకున్నాడు అనే ఒక క్యారెక్టర్ తో పృథ్వీరాజ్ మన ముందుకి రాబోతున్నాడు.
ఈ క్యారెక్టర్ కోసం మొదట రాజమౌళి తెలుగులో స్టార్ హీరోలైన నాగార్జున, గోపి చంద్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో మలయాళం నుంచి పృధ్విరాజ్ కుమారన్ ను తీసుకువచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి…నిజానికి నాగార్జున గాని, గోపీచంద్ గాని ఆ పాత్రను చేసి ఉంటే దానికి ఇంకా హై వచ్చి ఉండేదని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
నిజానికి రాజమౌళి సినిమాలో విలన్ పాత్రలకు మంచి క్రేజ్ ఉంటుంది. కానీ వీల్ చైర్ లో ఉండే పాత్ర అవ్వడం వల్ల మాకు పెద్దగా యూస్ ఏమీ ఉండదేమో అనే ఉద్దేశంతో ఆలోచించిన నాగార్జున, గోపీచంద్ ఇద్దరు కూడా ఆ పాత్రను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక నాగార్జున సైతం ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఊపిరి సినిమాలో తను చేసిన క్యారెక్టర్ మాదిరిగానే కుంభ పాత్ర ఉంది. మళ్ళీ అలాంటి క్యారెక్టర్ చేయడం ఇష్టంలేక ఆయన ఆ పాత్ర కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదట…