Pawan Kalyan Raviteja: గత కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించడం లేదు. ఆయన ఫుల్ టైం పొలిటిషన్ గా మారినప్పటి నుంచి పాలిటిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు కావడం విశేషం…ఈ సంవత్సరం ఆయన సుజీత్ డైరెక్షన్లో చేసిన ‘ఓజీ’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో మరోసారి అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు…పవన్ కళ్యాణ్ మరోసారి మరో మంచి సినిమాతో వస్తే ఆదరించడానికి మేము రెడీగా ఉన్నామంటూ ప్రేక్షకులు సైతం వల్లభిప్రయాలను తెలియజేస్తుండటం విశేషం…ఇక పవన్ కళ్యాణ్ సైతం ప్రస్తుతం కొత్త సినిమాలను కమిటయ్యే ఆలోచనలో ఉన్నాడు. తన అభిమానులను నిరాశపర్చకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన సినిమాలను చేస్తుండటం విశేషం…
ఇక దానికి తోడుగా తన పార్టీని నడిపించడానికి తన దగ్గర డబ్బులు లేవని అందువల్లే సినిమాలు చేస్తున్నాను. అలా వచ్చిన డబ్బుతోనే పార్టీని నడిపిస్తున్నాను అంటూ గతంలో పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలకు వస్తున్న డబ్బులతోనే తన పార్టీని నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి పవన్ కళ్యాణ్ సమయం దొరికిన ప్రతిసారి సినిమాలైతే చేస్తున్నాడు.
ఆయన గత కొన్ని రోజుల నుంచి సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమా చేస్తాను అంటూ వచ్చినప్పటికి ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం లేకుండా పోయిందట. ఆయన చెప్పిన కథ బాగున్నప్పటికి, ఆ కథను తీయాలంటే చాలా ఎక్కువ రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ సైతం ఆ మూవీ కోసం ఎక్కువ డేట్స్ కేటాయించాల్సిన అవసరమైతే ఉందట.
ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా మీద ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించే అవకాశం లేదు. కాబట్టి ఆ కథను రిజెక్ట్ చేశారట. ఇక దాంతో సురేందర్ రెడ్డి రవితేజ ను అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. రవితేజ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వీళ్ళ కాంబోలో వచ్చిన కిక్ బ్లాక్ బాస్టర్ గా నిలువగా, కిక్ 2 మాత్రం ఫ్లాప్ అయింది..ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది…