Pawan Kalyan And Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. యాంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఇలాంటి మిస్టేక్స్ చేసిన వారే కావడం విశేషం…సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఇలాంటి ఒక మిస్టేక్ ని చేశాడు. తన కెరియర్ స్టార్టింగ్ లో చేయాల్సిన రెండు సినిమాలను వదిలేసుకోవడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడు… పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన సినిమాని మొదట మహేష్ బాబు తో చేయాలనుకున్నారట. కానీ కృష్ణ ఆ సినిమా మహేష్ కి సెట్ అవ్వదనే ఉద్దేశ్యంతో ఆ సినిమాని రిజెక్ట్ చేశారట. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఆ సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు… త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమాని మహేష్ బాబుతో చేసిన తర్వాత జల్సా సినిమాని సైతం మహేష్ బాబు తోనే చేయాలని అనుకున్నాడు. కానీ మహేష్ బాబు అప్పటికే ‘పోకిరి’ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు.
దాంతో ఆయన కమర్షియల్ గా మాస్ సినిమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపించాడు. అందువల్లే సేఫ్టీ గా ఉండే జల్సా సినిమా కథ మహేష్ బాబుకు అంత ఎక్సైటింగ్ గా అనిపించలేదట. దానివల్ల ఆ సినిమాని మహేష్ రిజెక్ట్ చేశాడు. ఇంకా ఈ సినిమాని త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే…
ఈ రెండు సినిమాలను మిస్ చేసుకొని మహేష్ బాబు చాలా వరకు తన కెరీర్ ని కోల్పోయాడనే చెప్పాలి. పోకిరి తర్వాత మహేష్ బాబు కి వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలైతే వచ్చాయి. దాదాపు 5 సంవత్సరాల వరకు అతనికి సరైన సక్సెస్ అయితే లేదు. అలాంటి సందర్భంలో జల్సా లాంటి సినిమా చేసి ఉంటే ఆ మూవీ అతనికి బాగా సెట్ అయ్యేది. దానివల్ల అతనికి మంచి పేరు కూడా వచ్చేదని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతను కొనసాగిస్తూ సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తుంటే మహేష్ బాబు మాత్రం ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధిస్తే మాత్రం ప్రపంచంలోనే మహేష్ బాబు వన్ అఫ్ ది టాప్ హీరోగా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…