https://oktelugu.com/

Trivikram – Pawan : త్రివిక్రమ్ కు పవన్ కొత్త ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చాడా? దాని విలువ అన్ని కోట్లా? నిజమెంత?

పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా గడుపుతున్నారు. అదే సమయంలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు పూర్తి చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2023 / 03:28 PM IST
    Follow us on

    Trivikram – Pawan : పరిశ్రమలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జల్సా చిత్రం కోసం కలిసిన వీరు స్నేహం దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఒకరిపై మరొకరికి ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. త్రివిక్రమ్ ని తన గురు, మెంటర్ అని పవన్ కళ్యాణ్ పబ్లిక్ వేదికల్లో చెప్పడం కొస మెరుపు. త్రివిక్రమ్ పెద్ద మేధావి. చాలా విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. పురాణాలు, తెలుగు భాష మీద ఆయనకు విపరీతమైన పట్టు ఉందని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ అన్నారు.

    వీరి కాంబోలో మూడు చిత్రాలు వచ్చాయి. జల్సా నాటికి పవన్ వరుస ప్లాప్స్ లో ఉన్నారు. ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కారు. రెండో చిత్రంగా అత్తారింటికి దారేది తెరకెక్కింది. ఈ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇక మూడో చిత్రం అజ్ఞాతవాసి. భారీ అంచనాల మధ్య విడుదలైన అజ్ఞాతవాసి ఆశించిన స్థాయిలో ఆడలేదు. వీరు కలిసి సినిమా చేయకపోయినా… పవన్ కళ్యాణ్ సినిమా నిర్ణయాల వెనుక త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటుంది.

    కమ్ బ్యాక్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాల విషయంలో త్రివిక్రమ్ ప్రమేయం చాలా ఉంది. భీమ్లా నాయక్, బ్రో చిత్రాలకు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఆ మూడు చిత్రాలు త్వరితగతిన పూర్తయ్యేలా త్రివిక్రమ్ కృషి చేశారు. త్రివిక్రమ్ తన పట్ల చూపించే ప్రేమాభిమానాలకు ముగ్దుడైన పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్ ఇచ్చాడట. త్రివిక్రమ్ బర్త్ డే కానుకగా కోట్ల విలువ చేసే ఇల్లు ఇచ్చాడని టాలీవుడ్ టాక్.

    జూబ్లీ హిల్స్ ఏరియాలో రూ. 6 కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇంటిని త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ రాసిచ్చారట. అయితే పుకార్లలో నిజమెంతో తెలియదు. కారణం… పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కి గిఫ్ట్ ఇచ్చినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు త్రివిక్రమ్ గుంటూరు కారం చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా గడుపుతున్నారు. అదే సమయంలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు పూర్తి చేస్తున్నారు.