
దేశంలో కరోనా క్రైసిస్ కారణంగా అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో తిరిగి పుంజుకునేందుకు చాలా సమయం పట్టేలా కన్పిస్తోంది. ఇక కరోనా ఎఫెక్ట్ తో సినిమా రంగం పూర్తిగా కుదేలైపోయింది. షూటింగులు నిలిచిపోగా.. థియేటర్లు.. మల్టిపెక్సులు మూతపడ్డాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
గత ఆరేడు నెలలుగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీలు కళకళలాడాయి. కొత్త సినిమాలన్నీ ఓటీటీల్లో రిలీజు కావడంలో థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటుపడిపోయింది. దీంతో ఓటీటీలు లాభాలబాటపట్టాయి. చిన్న సినిమాలు ఓటీటీలకు వరంగా మారగా.. పెద్ద సినిమాలకు మాత్రం ఓటీటీలతో పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు.
Also Read: ఆర్ఆర్ఆర్: చరణ్ వర్సెస్ ఎన్టీఆర్.. సరికొత్త ట్విస్ట్.!
భారీ బడ్జెట్లో నిర్మించే సినిమాలకు భారీ ధర చెల్లించి ఓటీటీలు కోనుగోలు చేసే పరిస్థితి ఉండేది కాదు. అయితే ఇటీవల థియేటర్లు మూతపడటంతో పెద్ద సినిమాలు సైతం ఓటీటీలు అడిగిన ధర సినిమాలను అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో పెద్ద సినిమాలు సైతం ఓటీటీల్లో రిలీజయ్యాయి. అయితే ఓటీటీల్లో రిలీజైన పెద్ద సినిమాలన్నీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
ఇటీవల ఓటీటీల్లో రిలీజైన నాని ‘వి’.. అనుష్క ‘నిశ్శబ్దం’.. కీర్తి సురేష్ ‘పెంగ్విన్’.. సత్యదేవ్ ‘47డేస్’ మూవీలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక రాజ్ తరుణ్ ‘ఓరేయ్ బుజ్జిగాడు’ పర్వాలేదనిపించింది. ఇక ఇటీవలే రిలీజైన ‘మిస్ ఇండియా’ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
Also Read: కరోనా క్రైసిస్ నుంచి మల్టిపెక్సులు కోలుకుంటాయా?
మిస్ ఇండియా థియేటర్లలో రిలీజైతే నిర్మాతలు భారీ పరాజయం చూడాల్సి వచ్చేది. ఈ సినిమాలన్నీ కూడా ఓటీటీల్లో రిలీజు కావడంతో నిర్మాతలు గట్టెక్కారని.. థియేటర్లో రిలీజైతే పెద్దఎత్తున నష్టపోయే వారనే సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఓటీటీలే ఈ సినిమాలను సేఫ్ చేయడంతో నిర్మాతలు హ్యాపీ ఫీలవుతున్నారు.