Commoners Struggle in Bigg Boss 9: టెలివిజన్ రంగంలో అత్యంత ప్రెస్టేజియస్ షో గా గుర్తింపు సంపాదించుకున్న ఒకే ఒక రియాల్టీ షో బిగ్ బాస్… గతంలో 8 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన ఈ షో ఇప్పుడు తొమ్మిదో సీజన్ కి రంగం సిద్ధం చేసింది…ఆదివారం రోజున బిగ్ బాస్ 9 షో ను స్టార్ట్ చేశారు. ఈ సీజన్ లో ఎవరెవరు కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు… ఇక సెలబ్రిటీస్ తో పాటుగా అగ్నిపరీక్ష లో కామన్ మ్యాన్స్ పాల్గొని టఫ్ ఫైట్ ను ఎదుర్కొని వచ్చిన ఆరుగురు కామనర్స్ ను అందులో భాగం చేయడం విశేషం…మొత్తానికైతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.9 మంది సెలబ్రిటీలు సెలబ్రిటీలు ఉండగా కామనర్స్ మాత్రమే ఆరుగురు ఉన్నారు. ఇక వీళ్ళందరిని కలిపి 15 మంది అయితే ఉన్నారు. మరి వీళ్ళలో విపరీతమైన పోటీ ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నిజానికి బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్ల కంటే కూడా చాలా టఫ్ గా ఉండబోతుందట. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ఈ షోని రన్ చేసే ప్రయత్నంలో షో యాజమాన్యం అయితే ఉన్నారు… ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో మెయిన్ హౌస్ కామనర్స్ కి ఇచ్చి అవుట్ హౌస్ మాత్రం సెలబ్రిటీలకు ఇచ్చారు.
మరి దీనికి కారణం ఏంటి అంటే కామనర్స్ కష్టపడి చాలా టాస్క్ లను ఎదుర్కొంటూ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. కాబట్టి వాళ్లకి కొంతవరకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయం మీదనే కొంతమందిని నెటిజన్లు మాత్రం ఫెయిర్ అవుతున్నారు. కామనర్స్ మాత్రమే కష్టపడ్డారా? సెలబ్రిటీలు ఆ స్థాయిని చేరుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారు.
అలాగే వాళ్ళు బిగ్ బాస్ లోకి రావడానికి ఇంకా ఎంత కృషి చేసి ఉంటారు. ఆ విషయాన్ని వాళ్లకు వీళ్ళకు సమానమైన ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం… ఏది ఏమైనా కూడా షో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ముందు ముందు సెలబ్రిటీలకు కూడా ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు తీసుకెళ్తారు…
మొదట్లో కామనర్స్ ను షో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్లు కూడా రెట్టింపు ఉత్సాహంతో టాస్కులను చాలా చక్కగా ఎదుర్కొంటారనే ఉద్దేశ్యంతోనే బిగ్ బాస్ యాజమాన్యం ఇలా చేస్తుంది అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు… మరి ఏది ఏమైనా కూడా ఈ సీజన్ గత సీజన్ల కంటే చాలా మంచి పాపులారిటీని సంపాదించుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…