NTR Directing Chiranjeevi Movie: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ ప్రారంభం లోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ , కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఎన్టీఆర్ , చిరంజీవి వాళ్ళ తరాలకు చెందిన నెంబర్ 1 హీరోలు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే వీళ్ళిద్దరే . అలాంటి ఈ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిసి గతంలో ఒక సినిమా చేశారనే విషయం నేటి తరం ఆడియన్స్ చాలామందికి తెలియదు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘తిరుగులేని మనిషి’. ఎన్టీఆర్ మెయిన్ హీరో గా నటించిన ఈ మూవీ లో చిరంజీవి సెకండ్ హీరో గా నటించాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!
అదేమిటంటే ఈ సినిమా నాల్గవ షెడ్యూల్ జరుగుతున్న సమయం లో ఆ చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు కి స్వల్పంగా అనారోగ్యానికి గురి అయ్యాడట. ఎట్టి పరిస్థితిలోనూ డాక్టర్లు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించడం తో, రాఘవేంద్ర రావు కి షూటింగ్ కి రాలేని పరిస్థితి. ఆయన కారణంగా షూటింగ్ రద్దు అయితే, మళ్లీ ఆర్టిస్టుల డేట్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది. అందుకే స్వయంగా ఎన్టీఆర్ ఆ వారం రోజుల షూటింగ్ ని తన దర్శకత్వం లో తెరకెక్కించాడట. చిరంజీవి , విలన్ కైకాల సత్యనారాయణ మధ్య వచ్చే ఒక పోరాట సన్నివేశాన్ని ఎన్టీఆర్ తెరకెక్కించాడని తెలుస్తోంది. అలా ఒక జనరేషన్ కి చెందిన నెంబర్ 1 సూపర్ స్టార్ , మరో జనరేషన్ కి సంబంధించిన నెంబర్ 1 సూపర్ స్టార్ కి దర్శకత్వం వహించాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.
ఎన్టీఆర్ కి దర్శకత్వం కొత్తేమి కాదు. ఆయన దర్శకత్వం లో ‘సీత రామ కళ్యాణం ‘, ‘గులేబకావలి కథ’, ‘దాన వీర సూర కర్ణ’ , ‘కుల గౌరవం ‘, ‘తాతమ్మ కల’, ‘వరకట్నం’, ‘చాణక్య చంద్రగుప్త’, ‘శ్రీ రామ పట్టాభిషేకం’ ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. అనుభవం ఉన్న మంచి దర్శకుడు కాబట్టే, రాఘవేంద్ర రావు వారం రోజులు ప్రశాంతం గా విశ్రాంతి తీసుకోగలిగాడని అంటున్నారు. ఎన్టీఆర్ లాగా చిరంజీవి కూడా దర్శకత్వం వహిస్తే బాగుంటుందని అభిమానుల కోరిక. 70 ఏళ్ళ వయస్సు దాటిన తర్వాత కచ్చితంగా ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తానని గతం లో ఆయన చెప్పుకొకడు కాబట్టి , రాబోయే రోజుల్లో మనం మెగాస్టార్ ని డైరెక్టర్ గా చూడొచ్చు అన్నమాట.