Nagarjuna: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పర్చుకున్న హీరోలలో ఒకరు అక్కినేని నాగార్జున..మహానటుడు అక్కినేని నాగేశ్వర రావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగార్జున ఏనాడు కూడా తండ్రిని అనుకరించకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ టాప్ 3 హీరోలలో ఒకరిగా 3 దశాబ్దాలు కొనసాగాడు..ఆరు పదుల వయసు మీదకి వచ్చినా కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చెయ్యడం..వాళ్ళ రేంజ్ లోనే గ్లామర్ ని మైంటైన్ చెయ్యడం నాగార్జున గారి స్టైల్..అందుకే ఈయనని టాలీవుడ్ మన్మధుడి అని అందరూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు..లేడీస్ లో అక్కినేని నాగార్జున గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికీ లేదనడం లో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు..ఆయనతో కలిసి నటించాలని ప్రతి స్టార్ హీరోయిన్ కోరుకుంటుంది..కానీ నేటి తరం స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ నాగార్జున గారితో కలిసి ఒక సన్నివేశం చెయ్యడానికి చాలా ఇబ్బందికి గురైయ్యారట.

ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో 2019 వ సంవత్సరం లో ‘మన్మధుడు 2’ అనే సినిమా వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది..అయితే ఈ సినిమాలో నాగార్జున మరియు రకుల్ మధ్య ఒక లిప్ లాక్ సన్నివేశం ఉంటుంది..డైరెక్టర్ రాహుల్ రవిచంద్రన్ ఈ సినిమా స్టోరీ రకుల్ కి చెప్పేముందు ఇలా లిప్ లాక్ ఉంటుంది అనే విషయాన్నీ చెప్పలేదట..దానితో ఆ సన్నివేశం లో నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్ నిరాకరించింది అట..నాగార్జున లాంటి సీనియర్ హీరోతో అలాంటి సన్నివేశం ఎలా చేసేది..నావల్ల కాదంటూ రకుల్ ఆ సన్నివేశం చెయ్యడానికి నిరాకరించింది అట..పైగా నాగార్జున గారి తనయుడు నాగచైతన్య తో కలిసి ఒక సినిమా కూడా చేశాను.

జనాలు ఇలాంటి సీన్ వాళ్ళ నాన్న గారితో చేస్తే ఏమి అనుకుంటారు..ఆ సన్నివేశం ఛస్తే చెయ్యను అంటూ తెగేసి చెప్పిందట..ఇదే విషయాన్నీ నాగార్జున కి చెప్పడం తో ఆయన రకుల్ ని ఒప్పించే ప్రయత్నం చేసాడు..చివరికి బలవంతంగానే రకుల్ ని ఒప్పించి ఆ సన్నివేశం చేసాడు..రకుల్ ఆ సన్నివేశం ని చాలా ఇబ్బంది పడుతూనే చేసిందట..ఆడియన్స్ నుండి కూడా ఆ సన్నివేశం కి సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్ల్స్ వచ్చాయి..వయస్సు కి తగ్గ పాత్రలు చెయ్యకుండా నాగార్జున గారు ఇలాంటి చెత్త సన్నివేశాలలో నటించడం ఏంటి అంటూ ఆయన అభిమానులు కూడా అప్పట్లో విరుచుకుపడ్డారు.