
కింగ్ ఈజ్ కింగ్.. ఆల్‌వేస్ కింగ్ అని అంటుంటారు. టాలీవుడ్‌లో కింగ్ అయిన నాగార్జున కూడా హోస్ట్‌గా తనదైన స్టైల్‌లో అలరిస్తున్నాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నుంచి లేటెస్ట్ ‘బిగ్‌బాస్’ వరకు ఎపిసోడ్‌లను రక్తికట్టిస్తున్నాడు. వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన బిగ్‌బాస్ ఇప్పుడు తెలుగు సీజన్‌లలో ఆకట్టుకుంటోంది. ఇందుకు కారణంగా నాగార్జుననే. షో నడవాలంటే.. హోస్ట్ ఎంతో కీలకం. కంటెస్టెంట్లు బలంగా లేకున్నా ఈ బిగ్‌బాస్ సీజన్‌లో నాగార్జున హోస్ట్‌గా అలరిస్తున్నాడు.కింగ్ నాగార్జున అందిస్తున్న ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు బిగ్‌బాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ గ్రాండ్ రియాలిటీ షో మొదలై ఇప్పటికే మూడు వారాలు గడిచింది. ప్రతీ వీకెండ్స్‌లో హోస్ట్‌గా నాగ్ వస్తారన్న సంగతి తెలిసిందే. అలా నాగ్ హోస్ట్ చేసిన గత సెప్టెంబర్ 19, 20 తేదీల్లో ప్రసారమైన ఎపిసోడ్స్‌కు మంచి టీఆర్పీనే వచ్చిందట. శనివారం ఎపిసోడ్ కు గాను 9.6 టీఆర్పీ రాగా ఆదివారం ఎపిసోడ్‌కు 13కి పైగా టీఆర్పీ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వీకెండ్స్‌లో నాగ్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారో చూడొచ్చు”
.Also Read: పిల్లనిచ్చిన మామపై చిరంజీవి ప్రేమ
పైగా ఇదే వీకెండ్స్‌లో సస్పెన్సఫుల్‌గా ఎలిమినేషన్స్ ఉండటం మరింత ప్లస్ అయ్యింది. మరి ఇలాంటి షోను అద్భుతంగా నాగ్ హోస్ట్ చేసి ఒంటి చేత్తో రక్తి కట్టించడం మూలానే ఇదంతా అని చెప్పాలి.
Also Read: ఇంట్రస్టింగ్: పవన్ సినిమా.. అసలు కథ వినలేదా?
మొత్తంగా మాటీవీ కింగ్ నాగార్జున మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతున్నట్లే కనిపిస్తోంది. తన ఒంటి చేత్తో బిగ్‌బాస్‌ను నడిపిస్తున్నారనేది ప్రేక్షకులకూ అర్థమవుతోంది. మున్ముందు కూడా ఇలానే అలరించాలని.. అలరిస్తాడని ఆశిద్దాం.