Nagarjuna Coolie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో భారీ సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలా మంది ఉన్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున లాంటి నటుడు వైవిద్య భరితమైన సినిమాలను చేస్తూ వచ్చాడు. కెరియర్ మొదటి నుంచి కూడా ఆయన మూస ధోరణిలో వెళ్లకుండా ఇతర హీరోలకు భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకొని మరి వాటిని చేసి సక్సెస్ ని సాధించాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే, రజనీకాంత్ తో చేస్తున్న కూలీ సినిమా మరొకెత్తుగా మారబోతోంది అంటూ చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేశారు…ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర హోలీ గా ఉంటుంది అని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ నాగార్జున విలనిజం అనేది కూలీ సినిమాలో అంత ఎఫెక్టివ్ గా లేదు. విక్రమ్ సినిమాలో చివరి ఐదు నిమిషాలు సూర్యా వచ్చి రోలెక్స్ పాత్రలో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో నాగార్జున అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయాడు. కారణం ఏంటి అంటే లోకేష్ కనకరాజు నాగార్జున క్యారెక్టర్ ని రాసుకోవడంలోనే చాలా వరకు రాంగ్ స్టెప్స్ అయితే వేశాడు…అందువల్లే ఆయన క్యారెక్టర్ తేలిపోయింది.
Also Read: ఇంతకీ ‘విశ్వంభర’ లో విలన్ అతనేనా..? ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్!
నిజానికి ఒక క్యారెక్టర్ ని విలన్ గా ప్రజెంట్ చేయాలి అంటే దానికి చాలా రకాల సీన్స్ ని రాయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలి. అలా చేసినప్పుడే ఒక నటుడి తాలూకు డెప్త్ అనేది బయటపడుతోంది. అలా చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా సినిమాలను తీసి ఆ క్యారెక్టర్ లో వాళ్ళు ఎలివేట్ అవుతారని చెబితే అది మన మూర్ఖత్వమే అవుతోంది…
ఒక రకంగా నాగార్జున ఈ సినిమాలో చేసిన సైమన్ పాత్రతో ఇండియా లెవెల్లో భారీ ఇమేజ్ అయితే వస్తుందని ఊహించాడు. కానీ అది జరగలేదు దానికి తోడుగా ఆయన ఆ క్యారెక్టర్ ని ఎందుకు చేశాడు అంటూ చాలామంది అతన్ని విమర్శించారు. మరి ఏది ఏమైనా కూడా విలన్ పాత్రను పోషించడం నాగార్జునకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు.
మరి ఇకమీదట అలాంటి పాత్రలు వస్తే చేస్తాడా? లేదంటే ఈ క్యారెక్టర్ తో ఎదుర్కొన్న నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ని గుర్తుంచుకొని ఇకమీదట విలన్ పాత్రలను కూడా రిజెక్ట్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది…మరి ఏది ఏమైనా కూడా ఇండియాలో మంచి పాపులారిటిని సంపాదించుకోవాలని చూసిన నాగార్జునకి ఈ క్యారెక్టర్ ద్వారా కొంతవరకు బ్యాడ్ ఇమేజ్ వచ్చిందనే చెప్పాలి…