SSMB29 Director Cameron: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ నేడు పాన్ వరల్డ్ స్థాయికి మన తెలుగు సినిమాని తీసుకెళ్లిన రాజమౌళి(SS Rajamouli) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి ప్రతిభ ఉన్న దర్శకుడు మన ఇండస్ట్రీ లో పుట్టడం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం, అదే ఆయనకు ఉపయోగించదగ్గ పదజాలం. #RRR తో హాలీవుడ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి, తన తదుపరి చిత్రం తో హద్దులు చెరిపేస్తాడని మనమంతా ఊహించాము. మన ఊహలకు తగ్గట్టుగానే ఆయన మహేష్(Super Star Mahesh Babu) తో చేయబోతున్న సినిమా ని ప్లాన్ చేస్తున్నాడు. నవంబర్ లో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఉంటుంది అని, ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఆ అప్డేట్ ని రివీల్ చేస్తామని రాజమౌళి ఇప్పటికే మహేష్ బాబు పుట్టినరోజు నాడు చెప్పుకొచ్చాడు.
Also Read: ఇంతకీ ‘విశ్వంభర’ లో విలన్ అతనేనా..? ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్!
ఇంతకీ ఆయన ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ఏమిటి?, ప్రొమోషన్స్ లో ఎప్పుడూ సరికొత్త స్ట్రాటజీ ని ఉపయోగించే రాజమౌళి, ఈసారి ఏమి చేయబోతున్నాడు అనే ఆత్రుత ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన మొదటి అప్డేట్ ని ‘అవతార్’, ‘టైటానిక్’ చిత్రాల సృష్టికర్త జేమ్స్ కెమరూన్ తో లాంచ్ చేయించే ప్లాన్ లో ఉన్నాడట. అది కూడా ఎదో ట్విట్టర్, లేదా వేరే సోషల్ మీడియా లో చేయిస్తారు అనుకుంటే పొరపాటే. త్వరలోనే జేమ్స్ కెమరూన్(James Cameron) తన లేటెస్ట్ చిత్రం ‘అవతార్: ది ఫైర్ & యాష్’ మూవీ విడుదల సందర్భంగా ప్రొమోషన్స్ కోసం ఇండియా కి రానున్నాడు. ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రత్యేకంగా ఆయన్ని ముఖ్య అతిథి గా ఆహ్వానించి మొదటి అప్డేట్ ని ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయించే ప్లాన్ లో ఉన్నారట. ఇదే కనుక జరిగితే వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి వచ్చే సౌండ్ మామూలు రేంజ్ లో ఉండదు.
ఇకపోతే ఈ సినిమాలో విలన్స్ గా ప్రియాంక చోప్రా మరియు పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అనేది ప్రస్తుతానికి సప్సెన్స్. ఈ సినిమాకు ‘GEN 35’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. అంటే శ్రీరాముడు కుటుంబానికి చెందిన 35 వ వంశస్తుడిగా ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించబోతున్నాడట. మృత సంజీవని కోసం అన్వేషించే పాత్రలో ఇందులో ఆయన కనిపిస్తాడని టాక్. అంతే కాదు ఈ చిత్ర లో హనుమంతుడి క్యారక్టర్ కూడా ఉంటుందట. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు రాజమౌళి. ఇలాంటి ఆలోచనతో ఈమధ్య కాలం లో ఎవ్వరూ అలోచించి ఉండరు. వర్కౌట్ అయితే మాత్రం మన తెలుగు సినిమా హాలీవుడ్ టాప్ 10 గ్రాస్సింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది.