https://oktelugu.com/

Bigg Boss Gangavva : ఇల్లు లేని గంగవ్వకు నాగార్జున సొంత డబ్బులు అన్ని లక్షలు ఇచ్చాడా!

Bigg Boss Gangavva : బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న సెన్సేషనల్ కంటెస్టెంట్ గంగవ్వ. సోషల్ మీడియా సెలబ్రిటీ హోదాలో గంగవ్వ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్నారు. దాదాపు అరవై ఏళ్ల వయసున్న గంగవ్వకు ఇతర కంటెస్టెంట్స్ మర్యాద, గౌరవం ఇచ్చేవారు. పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగిన గంగవ్వ గొప్ప ఆత్మవిశ్వాసం చూపించింది. ఏది ఏమైనా చివరి వరకు ఉండి టైటిల్ కొట్టుకుపోతా అని చెప్పేది. హౌస్లో ఉంది కొద్ది వారాలే అయినా… తన మార్క్ గేమ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 5, 2023 / 08:52 PM IST
    Follow us on

    Bigg Boss Gangavva : బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న సెన్సేషనల్ కంటెస్టెంట్ గంగవ్వ. సోషల్ మీడియా సెలబ్రిటీ హోదాలో గంగవ్వ షోలో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్నారు. దాదాపు అరవై ఏళ్ల వయసున్న గంగవ్వకు ఇతర కంటెస్టెంట్స్ మర్యాద, గౌరవం ఇచ్చేవారు. పల్లెటూరి వాతావరణంలో పుట్టి పెరిగిన గంగవ్వ గొప్ప ఆత్మవిశ్వాసం చూపించింది. ఏది ఏమైనా చివరి వరకు ఉండి టైటిల్ కొట్టుకుపోతా అని చెప్పేది. హౌస్లో ఉంది కొద్ది వారాలే అయినా… తన మార్క్ గేమ్ తో ప్రేక్షకులను అలరించారు.ఆమెకు బిగ్ బాస్ హౌస్ వాతావరణం సరిపడలేదు. దానికి తోడు కుటుంబ సభ్యుల మీద బెంగ ఆమెను కృంగదీశాయి.

    ఐదు వారాలకు గంగవ్వ అనారోగ్యం పాలయ్యారు. డాక్టర్స్ సూచన మేరకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు. సొంతింటి కల సాకారం చేసుకోవాలని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినట్లు గంగవ్వ అన్నారు. ఆ కోరిక నెరవేరకుండానే వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉందని ఎలిమినేషన్ డే రోజు… హోస్ట్ నాగార్జునతో అన్నారు. ఆమె మాటలకు చలించిపోయిన నాగార్జున నీ కల నేను నెరవేరుస్తాను. నీ ఇంటి నిర్మాణానికి కావలసిన డబ్బులు ఇస్తానని నాగార్జున అందరి ముందు హామీ ఇచ్చారు.

    ఇచ్చిన మాటను నాగార్జున నిలబెట్టుకున్నారని గంగవ్వ వెల్లడించారు. రెండేళ్ల క్రితం గంగవ్వ తన సొంత ఊరిలో మంచి ఇల్లు నిర్మించుకుంది. దాని నిర్మాణానికి రూ. 20 లక్షలు పైగా ఖర్చు అయ్యింది. బిగ్ బాస్ షోలో ఐదు వారాలు ఉన్నందుకు గంగవ్వకు నిర్వాహకులు రూ. 10 లక్షలు ఇచ్చారట. మరో రూ. 7 లక్షలు నాగార్జున తన సొంత డబ్బు ఇచ్చారట. తన దగ్గర ఉన్న మిగతా డబ్బులతో ఇల్లు పూర్తి చేసినట్లు గంగవ్వ తాజాగా చెప్పుకొచ్చారు. తన యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా వెల్లడించారు.

    గంగవ్వకు ఇంటి సభ్యులు బాగా మిత్రులు అయ్యారు. అఖిల్ సార్థక్ ని గంగవ్వ అభిమానించారు. వీరిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ఇక ఐదు వారాలున్న గంగవ్వకే పది లక్షలు ఇచ్చారంటే మిగతా సెలెబ్రిటీలు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా బాగానే సంపాదిస్తున్నారని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా అభిజీత్ నిలిచాడు. అఖిల్ రన్నర్ అయ్యాడు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలతో గంగవ్వ ఫేమస్ అయ్యారు.