Krishna influence on Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉన్నంత మాత్రాన స్టార్ హీరోలుగా మారిపోవచ్చు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి సినిమాలు చేసిన కూడా సక్సెసులు దక్కితేనే స్టార్ హీరోలుగా మారుతారు. లేకపోతే మాత్రం ఎవ్వరు కూడా స్టార్ హీరోలు అవ్వలేరనేది వాస్తవం…సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం రాజకుమారుడు సినిమాతో సక్సెస్ ని అందుకున్నప్పటికి ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్లను మూటగట్టుకున్నాయి. దాంతో మహేష్ బాబు కెరియర్ ఎక్కడ డౌన్ అయిపోతుందేమో అనే ఉద్దేశ్యంతో కృష్ణ టాప్ డైరెక్టర్లందరితో కలిసి తన కొడుకుతో ఒక సినిమా చేయాలని చెప్పారట. మొత్తానికైతే అప్పుడున్న దర్శకులు కొంతమంది ఓకే అన్నప్పటికి మరి కొంత మంది మాత్రం కృష్ణ కి సహకరించలేదట. ఇక జయంత్ సి పరంజీ టక్కరి దొంగ సినిమాను చేశాడు. కానీ అది ప్లాప్ అయింది.
బి గోపాల్ ‘వంశీ’ సినిమా చేశాడు అది కూడా డిజాస్టర్ గా మారింది…ఇక ఏది ఏమైనా కూడా టాలెంటెడ్ డైరెక్టర్ అయిన కృష్ణవంశీ ‘మురారి’ సినిమాతో మహేష్ బాబుకి ఒక భారీ విజయాన్ని అందించాడు. అలాగే గుణశేఖర్ లాంటి దర్శకుడు సైతం ‘ఒక్కడు’ సినిమాతో మహేష్ బాబుకు మర్చిపోలేని ఒక భారీ సక్సెస్ ని కట్టబెట్టాడు.
దాంతో మహేష్ బాబు స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు… ఇక ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న వారణాసి సినిమా మీదనే తను తను భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఆ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది.
ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది…మహేష్ బాబు చేసే ప్రతి సినిమాలో ఏదో కొత్తదనాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ఈ సినిమాలో చాలా వైవిధ్యమైన నటనను చూపించడానికి ట్రై చేస్తున్నాడు. ఇక ఈ మూవీతో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తే సాధించాలని తన అభిమానులు కోరుకుంటున్నారు…