Kajal Agarwal First Movie: పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న కాజల్ అగర్వాల్(Kajal Agarwal) మొట్టమొదటి సినిమా ఏమిటి అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ‘లక్ష్మీ కళ్యాణం’. తేజ దర్శకత్వం లో కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ఈ చిత్రం 2007 వ సంవత్సరం లో విడుదలై ఫ్లాప్ గా నిల్చింది. కానీ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ మాత్రం అందరి దృష్టిలో పడింది. అవకాశాలు క్యూలు కట్టాయి. చూస్తూ ఉండగానే ఇండస్ట్రీ లో నెంబర్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఇప్పుడు పెళ్లి తర్వాత స్పీడ్ బాగా తగ్గించింది కానీ ఒకప్పుడు మాత్రం కాజల్ అగర్వాల్ లేని సినిమా అసలు ఉండేది కాదు. అంతటి డిమాండ్ ని సొంతం చేసుకుంది. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా కాజల్ అగర్వాల్ మొదటి చిత్రం లక్ష్మి కళ్యాణం కాదు.
ఈ సినిమాకు ముందు 2004 వ సంవత్సరం లో వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi), ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘క్యూన్ హో గయానా'(Kyun Ho Gayana) అనే చిత్రం తెరకెక్కింది. ఇందులో ఐశ్వర్య రాయ్ కి స్నేహితురాలి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించింది. ఒక పాటలో ఆమె ఐశ్వర్య రాయ్ తో కలిసి డ్యాన్స్ వేస్తూ ఉన్న వీడియో ఇన్ స్టాగ్రామ్ లో ఎవరో కొంతమంది అభిమానులు అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. ఇదేంటి?, కాజల్ అగర్వాల్ ఎప్పుడు ఐశ్వర్య రాయ్ తో కలిసి నటించింది?, ఆమె మొదటి సినిమా మన తెలుగు లో కాదా? అని ఆమె గూగుల్ లో రీసెర్చ్ చేయడం మొదలు పెట్టగా, ఈ విషయం తెలిసింది. కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, తమిళం లో కూడా ఆమె హీరోయిన్ అయ్యే ముందు అనేక సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిందట.
అలా అంచలంచలుగా ఎదుగుతున్న సమయం లో ఈమె డైరెక్టర్ తేజ దృష్టిలోకి వచ్చింది. వెంటనే ఆడిషన్స్ కి పిలిచి తన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆమె సినీ ప్రస్థానం ఎలా సాగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్కసారి కూడా కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ ఏడాది సికిందర్ మరియు కన్నప్ప చిత్రాలతో మన ముందుకు వచ్చిన కాజల్ అగర్వాల్, ప్రస్తుతం హిందీ రామాయణం లో రావణుడి భార్య క్యారక్టర్ లో నటిస్తుంది. ఈ సినిమా మినహా కాజల్ అగర్వాల్ చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్స్ ని మాత్రమే ఆమె చేస్తూ ముందుకు వెళ్తుంది.
View this post on Instagram