Game Changer Promotions : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ నేపథ్యంలో మూవీ టీం మొత్తం ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. జనవరి 2 న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ద్వారా ప్రొమోషన్స్ ని మొదలు పెట్టారు. ఆ తర్వాత మూవీ టీం ముంబై కి వెళ్ళింది. అక్కడ ప్రెస్ మీట్ ని నిర్వహించే ముందు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 18’ షోలో రామ్ చరణ్ తో పాటు కైరా అద్వానీ పాల్గొన్నది. వీళ్లిద్దరు హౌస్ లోపలకు వెళ్లి అక్కడ కంటెస్టెంట్స్ తో కొన్ని గేమ్స్ ఆడించారు. ఆ మరుసటి రోజున ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. అయితే హీరోయిన్ గా నటించిన కైరా అద్వానీ కేవలం బిగ్ బాస్ షోలో ప్రొమోషన్స్ చేసింది కానీ, మిగిలిన ఏ ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా ఆమె పాల్గొనలేదు.
సినిమాకి అత్యంత కీలకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆమె పాల్గొనకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత పెద్ద సినిమాలో హీరోయిన్ గా నటించి, కనీసం ప్రొమోషన్స్ చేయడానికి కూడా రారా?, కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునేది ఎందుకు అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు కైరా అద్వానీ పై మండిపడుతున్నారు. కైరా ఉండేది ముంబై లో కాబట్టి, ఆమె తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ప్రొమోషన్స్ కి రావడానికి ఇబ్బంది పడుతుంది అనుకుందాం. మరి పక్క రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె ఎందుకు పాల్గొనలేదు?, ముంబై లోనే కదా ప్రెస్ మీట్ ని నిర్వహించింది అంటూ అభిమానులు ఆమెని నిలదీస్తున్నారు. ఎల్లుండి చెన్నై లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేస్తున్నారు.
ఈ ఈవెంట్ కి కూడా కైరా అద్వానీ పాల్గొనడం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఆమె ఇలా ప్రొమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనకపోవడానికి ఒక కారణం ఉందని అంటున్నారు విశ్లేషకులు. నిర్మాత దిల్ రాజు ని ఆమె కేవలం ప్రొమోషన్స్ కోసం కోటి రూపాయిల అదనపు రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసిందని, అందుకు దిల్ రాజు ఒప్పుకోకపోవడం వల్లే ప్రొమోషన్స్ లో పాల్గొనడం లేదని తెలుస్తుంది. ఎంతైనా శంకర్, రామ్ చరణ్ లాంటి సూపర్ స్టార్స్ పనిగట్టుకొని ప్రొమోషన్స్ లో పాల్గొంటున్న సమయం లో వాళ్లకి కనీస స్థాయిలో కూడా సపోర్ట్ ఇవ్వకపోతే ఇక ఎందుకు కలిసి ఒకే సినిమాలో పని చేసి ఉపయోగం అని అంటున్నారు.కనీసం అన్ స్టాపబుల్ రామ్ చరణ్ ఎపిసోడ్ లో అయినా దిల్ రాజు తో కలిసి వస్తుందని అనుకున్నారు, అది కూడా జరగలేదు. కేవలం ఆమె బాలీవుడ్ లో నిర్వహించే టాప్ షోస్ ప్రొమోషన్స్ లోనే పాల్గొంటానని చెప్పిందట.