Rajashekar: హీరో రాజశేఖర్ ఆ మూవీలు చేసి ఉంటేనా?

Rajashekar: టాలీవుడ్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా హీరో రాజశేఖర్ కు గుర్తింపు ఉంది. యాక్షన్ మూవీలతో మాస్ ప్రేక్షకులను మెప్పించే రాజశేఖర్ కెరీర్ 90వ దశకంలో పిక్స్ లో ఉండేది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, నటసింహం బాలయ్య మాదిరిగానే రాజశేఖర్ కు సైతం అప్పట్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ రోజుల్లో అగ్ర దర్శక, నిర్మాతలకు కూడా ఆయన కాల్ షిట్స్ దొరికేవీ కావు. దీంతో ఆయన చాలా సినిమాలను […]

Written By: NARESH, Updated On : November 27, 2021 12:03 pm
Follow us on

Rajashekar: టాలీవుడ్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా హీరో రాజశేఖర్ కు గుర్తింపు ఉంది. యాక్షన్ మూవీలతో మాస్ ప్రేక్షకులను మెప్పించే రాజశేఖర్ కెరీర్ 90వ దశకంలో పిక్స్ లో ఉండేది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, నటసింహం బాలయ్య మాదిరిగానే రాజశేఖర్ కు సైతం అప్పట్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ రోజుల్లో అగ్ర దర్శక, నిర్మాతలకు కూడా ఆయన కాల్ షిట్స్ దొరికేవీ కావు. దీంతో ఆయన చాలా సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది.

Rajashekar

అయితే ఇటీవల ఆయనకు వరుస ప్లాపులు వస్తుండటం అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రస్తుతం సినిమా కెరీర్ పరంగా అతడికి కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొనడంతో కొంత గ్యాప్ తీసుకొని మంచి కథల కోసం వెతుకుతున్నారు. సెలక్టివ్ గా నటిస్తూ ముందుకెళుతున్నారు. ఒక్క హిట్ పడితే రాజశేఖర్ మునిపటిలా మళ్లీ బిజీ కావడం ఖాయమని ఆయన అభిమానులు చెబుతున్నారు.

రాజశేఖర్ సినిమా కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్ మూవీలు, ప్లాప్ మూవీలున్నాయి. తొలి నుంచి రాజశేఖర్ ఆవేశ పూరితమైన పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయనకు ఎక్కువగా అలాంటి పాత్రలే వచ్చాయి. వాటిని ఆయన చాలా చక్కగా వినియోగించుకొని స్టార్ హీరోగా ఎదిగారు. అంతేకాకుండా చాలా ప్రయోగాత్మకంగా చిత్రాల్లోనూ నటించి అనేక అవార్డులను సైతం రాజశేఖర్ దక్కించుకున్నారు.

ఇక ఆయన సినిమాలతో ఫుల్ బీజీగా ఉండటంతో పలు బ్లాక్ బస్టర్ మూవీలను చేజార్చుకున్నారు. ఆ సినిమాలే కానుక రాజశేఖర్ చేసి ఉంటే ఆయన కెరీర్ మరోలా ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ‘జెంటిల్మెన్’.

అగ్ర దర్శకుడు శంకర్ ముందుగా రాజశేఖర్ తోనే ఈ మూవీని తీయాలని భావించారు. అయితే ఆ సమయంలో రాజశేఖర్ బీజీగా ఉండటంతో ఆ ఛాన్స్ యాక్షన్ హీరో అర్జున్ వద్దకు వెళ్లింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

హీరో వెంకటేష్ కెరీర్లో మైలుస్టోన్ గా నిలిచిన ‘చంటి’లో రాజశేఖరే హీరోగా నటించాల్సి ఉంది. ఆ సమయంలో యాక్షన్ కథలకే ఆయన ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ మూవీ వెంకటేష్ వద్దకు వెళ్లింది. ఈ మూవీ టాలీవుడ్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది.

ఆ తర్వాత ‘ఠాగూర్’. ఈ మూవీ విషయంలోనే చిరంజీవికి, రాజశేఖర్ కు మధ్య విభేదాలు వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. ముందుగా ఈ మూవీ రీమేక్ హక్కులను రాజశేఖర్ దక్కించుకున్నాడని కానీ చిరంజీవి ఈ మూవీ చేశారనే వాదన ఉంది. ఈ మూవీ కూడా టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

నందమూరి బాలయ్య కెరీర్లో సూపర్ హిట్టుగా నిలిచిన ‘లక్ష్మీనరసింహ’ కూడా రాజశేఖర్ వద్దకే తొలుత వచ్చింది. ‘సామి’కి రీమేక్ వచ్చిన ఈ మూవీలో రాజశేఖర్ నటించాల్సి ఉండగా వేరే సినిమాతో బీజీగా ఉండటంతో ఈ సినిమాను వదులుకున్నాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టరే.

Also Read: ‘మావా.. సినిమాలో ఐటెం సాంగ్​ లేదా’.. ‘ఆర్​ఆర్​ఆర్​’ టీమ్ రిప్లై చూస్తే షాక్​?

దగ్గుపాటి రానా సోలో హిట్టుకొట్టిన ‘నేనే రాజు.. నేనే మంత్రి’లో తొలుత రాజశేఖర్ నటించారు. అయితే క్లైమాక్స్ విషయంలో దర్శకుడు తేజకు, రాజశేఖర్ మధ్య విబేధాలు వచ్చాయట. దీంతో ఈ మూవీ మధ్యలో ఆగిపోయింది. ఈ మూవీలో రానా నటించి సూపర్ హిట్ కొట్టాడు.

ఇలా రాజశేఖర్ తన వద్దకు వచ్చిన మంచి మంచి ప్రాజెక్టులను బీజీగా ఉండటం, ఇతర కారణాలతో వదులుకోవాల్సి వచ్చింది. ఈ మూవీలే కానుక రాజశేఖర్ చేసి ఉంటే ఆయన కెరీర్ మరోలా ఉండేదేమో..!

Also Read: ఆ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న త్రివిక్రమ్…