Urvashi: నటి ఊర్వశి అంటే తెలియని వారుండరు. ఈమె అమాయకత్వమైన నటన, గడుసుతనం, కొంటెతనం ఇలా ఎన్నో వివిధరకాలుగా అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పటికి కూడా కొన్ని సినిమాల్లో హీరోహీరోయిన్ లకు తల్లిపాత్రను పోషిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. అయితే ఈమె పేరు తీయగానే ముందుగా మద్యపానం గుర్తుకు వస్తుంది. ఎన్నో సార్లు మీడియాకు మందు తాగుతూ కనిపించింది. ఈవెంట్లకు, షోలకు కూడా మద్యం సేవించి వచ్చిందనే టాక్ మూటగట్టుకుంది నటి ఊర్వశి.
మంచి నటిగా పేరు సంపాదించి, ఇలా మద్యానికి ఎందుకు బానిస అయిందనే ప్రశ్న ఎవరికి అర్థం కాలేదు. అయితే ఇలా ఈమె మందుకు బానిస అవడానికి ప్రధాన కారణం ఆమె భర్త అని తెలుస్తోంది. ఊర్వశి నటుడు మనోజ్ కే జయాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. ఆమె పుట్టిన తర్వాత మనోజ్ ఊర్వశి అక్క కల్పనా తో సీక్రెట్ ఎఫైర్ కొనసాగించారనే టాక్ వచ్చింది. ఈ విషయం ఊర్వశికి తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవట. కానీ మనోజ్ మాత్రం ఊర్వశిని పట్టించుకోకుండా అసలు ఇంటికి కూడా రావడం మానేశారట.
సొంత అక్క, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇద్దరు ఇలా మోసం చేయడం తట్టుకోలేకపోయిందట ఊర్వశి. అందుకే మద్యానికి బానిస అయిందని అంటారు ఆమె గురించి తెలిసిన కొందరు. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టాట్ చేసిన తర్వాత గొడవలు పెరగడంతో ఇద్దరు కలిసి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ ఎంతో మంచి నటి అలా మద్యానికి బానిస అవడం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కానీ కారణం తెలిసిన తర్వాత చాలా మంది భర్తను, అక్కను విమర్శించారు.