Dhanush assault allegations top heroine: సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించడం అనేది అంతా మాషీ వ్యవహారమైతే కాదు. హీరోగా మారడానికి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజానికి మనలో చాలామంది ఒక్క సక్సెస్ ను సాధిస్తే చాలు స్టార్ హీరో అయిపోవచ్చు అనుకుంటారు. కానీ అదంతా ఒక అపోహ…ఒక్క సక్సెస్ సాధించినంత మాత్రాన ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోరు. ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకుంటూ ప్రేక్షకుడికి ఏం కావాలి అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా సినిమాను చేసి సక్సెస్ ని సాధించినప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో గుర్తింపైతే లభిస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే కెరియర్ మొదట్లో వీడేం హీరో రా బాబు అని అనిపించుకున్న ధనుష్ ఇప్పుడు హీరో అంటే ఇతనే అనే రేంజ్ లో ముందుకు తీసుకెళ్తున్నాడు. తన నటనతో ప్రేక్షకులందరిని మంత్రముగ్ధుల్ని చేశాడు… ఇక ఇప్పుడు ఆయన వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారిపోయాడు. కెరియర్ స్టార్టింగ్ లో ధనుష్ ఒక హీరోయిన్ ని కొట్టాడనే విషయం మీద అప్పట్లో తమిళ్ మీడియాలో చాలా కథనాలైతే వెలువడ్డాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే శ్రీదేవిగా తెలుస్తుంది. తెలుగులో ప్రభాస్ తో ఈశ్వర్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత తమిళ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
అక్కడ ధనుష్ తో ఒక సినిమా చేసింది అయితే ఆ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు ధనుష్ కి తనకి గొడవలైతే జరిగాయట. ఇక ఆ క్రమంలోనే ధనుష్ తన మీద చేయి చేసుకున్నాడనే వార్తలైతే వచ్చాయి. ఇక తర్వాత తను షూటింగ్ కి రానని చెప్పడంతో కొద్దిరోజుల పాటు షూటింగ్ ను నిలిపివేశారు.
ఇక ఆ తర్వాత కొంతమంది సినిమా పెద్దలు శ్రీదేవితో మాట్లాడి సినిమా షూటింగ్ కి రప్పించారట. మొత్తానికైతే అప్పటినుంచి ఆమెకు ఏ అవకాశం రాకుండా ధనుష్ చాలామంది ప్రొడ్యూసర్స్ తో ఆమెకు సినిమా మీద ఇంట్రెస్ట్ లేదని జస్ట్ టైం పాస్ కోసం చేస్తుందని చెప్పారట. దాంతో ఆమెకు పెద్దగా అవకాశాలైతే రాలేదు.
ఇక ధనుష్ వల్లే శ్రీదేవి తన సినిమా కెరీర్ ని కోల్పోయింది అంటూ అప్పట్లో తమిళ్ మీడియాలో కొన్ని కథనాలైతే వెలువడ్డాయి… ఇక ప్రస్తుతం శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా స్టార్ట్ చేసింది. నారా రోహిత్ హీరోగా ‘సుందరకాండ’ సినిమాలో నటించింది. ఆ సినిమాల తన నటన చాలా అద్భుతంగా ఉందంటూ సినిమా విమర్శకులు సైతం మెచ్చుకున్నారు…