Devara , Pushpa 2
Devara and Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ప్రాన్ ఇండియాలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకోవడం లో స్టార్ హీరోలు ముందు వరుసలో ఉన్నారు. ఇక వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్లు చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ లో అవ్వడంతో మరికొంతమంది యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ‘పుష్ప 2’ (Pudhpa 2) సినిమా భారీ ప్రభంజనాలను క్రియేట్ చేస్తూ ఇండస్ట్రీ హిట్టు కొట్టే విధంగా ముందుకు సాగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే నిన్న వీళ్ళ మీద ఐటి రైడ్ జరిగింది. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమా ప్రొడ్యూసర్స్ ఆయన కళ్యాణ్ రామ్ (Kalyan Ram), సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki vastunnaam) సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు పైన కూడా ఐటి రైడ్స్ నిర్వహించారు. మరి ఏది ఏమైనా కూడా ప్రొడ్యూసర్స్ భారీ కలెక్షన్స్ వస్తున్నాయంటూ కొన్ని పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు.
దాని వల్లే ఇలాంటి రైడ్స్ అయితే జరుగుతున్నాయి అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా కూడా దేవర సినిమా అలాగే పుష్ప 2 సినిమాకు సంబంధించిన పోస్టర్స్ అనేవి కొంతవరకు ఫేక్ తో కూడుకున్నవిగా తెలుస్తోంది ఇక రీసెంట్ గా ఆయా సినిమాల ప్రొడ్యూసర్స్ కూడా అదే విషయాన్ని ఐటి రైడ్స్ జరిగినప్పుడు తెలియజేసినట్టుగా తెలుస్తోంది…
పబ్లిసిటీ కోసమే అలాంటి పోస్టర్స్ వేసినట్టుగా కూడా కొంత సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు… ఇక పుష్ప 2 సినిమాకి నిజంగానే 1800 కోట్ల కలెక్షన్స్ వచ్చాయా లేదంటే ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేయడానికి వాళ్ళు అలాంటి పోస్టర్స్ ని వేశారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా పుష్ప సినిమాతో భారీ లాభాలను గడించిన మైత్రి వాళ్ళు భారీ రేంజ్ లో గవర్నమెంట్ కు పన్ను రూపంలో చెల్లించాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇవి ఫేక్ కలెక్షన్స్ అని మైత్రి వాళ్ళు చెబుతున్నారా లేదంటే ఒరిజినల్ కలెక్షన్స్ అయితే వాటికి పన్ను కట్టాల్సి ఉంటుందని ఉద్దేశ్యంతో ఇంకా ఏదైనా స్టోరీ క్రియేట్ చేస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా ఒకేసారి ప్రొడ్యూసర్స్ అందరి మీద రైడ్స్ జరగడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీని కొంతవరకు కుదిపేస్తున్నట్టుగా తెలుస్తోంది…