
Bigboss Siri : యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకున్న సిరి, ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిన సిరికి సోషల్ మీడియా లో మామూలు క్రేజ్ లేదు.బుల్లితెర మీద ప్రసారం అయ్యే ‘ఉయ్యాలా జంపాల’ అనే డైలీ సీరియల్ ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత ‘అగ్ని సాక్షి’ , ‘సావిత్రమ్మ గారి అమ్మాయి’ వంటి సీరియల్స్ లో నటించింది.
ఇక ఆ తర్వాత యూట్యూబ్ లో ‘సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్ళు’, ‘రామ్ లీల’ , ‘మేడం సార్..మేడం అంతే’ వంటి షార్ట్ ఫిలిమ్స్ తో సోషల్ మీడియా లో ఉన్న యూత్ కి దగ్గరైంది.ఈ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ తన ‘హే సిరీ’ అనే యూట్యూబ్ ఛానల్ లోనే ఉన్నాయి.ఈ ఛానల్ కి ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాక ముందే ఆరు లక్షల మంది ఉన్నారు.
కేవలం యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఈమె సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది.రీసెంట్ గా ఈమె జీ 5 యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పులి మేక’,మరియు ఆహా మీడియా లో ‘BFF’ వంటి వెబ్ సిరీస్ లలో ముఖ్యమైన పాత్రలు పోషించింది.ఇదంతా పక్కన పెడితే సిరి ఈ రంగం లోకి అడుగుపెట్టాక ముందు వైజాగ్ లోని కొన్ని లోకల్ చానెల్స్ లో న్యూస్ రీడర్ గా వ్యవహరించింది అట.
చిన్నతనం లోనే తండ్రి చనిపోవడం తో, ఎన్నో కష్టాలు మరియు ఆర్ధిక నష్టాలను చూశామని, ఎలా అయినా పైకి ఎదగాలనే తాపత్రయంతో చేతికి దొరికిన ప్రతీ పని చేసేదానిని అని, అలా ఈ రంగం లోకి అడుగుపెట్టి నేడు ఈ స్థానం లో ఉన్నందుకు ఎంతో సంతోషం గా ఉంది అంటూ సిరి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.