https://oktelugu.com/

Balakrishna Movies : బాలయ్య చేసిన ఆ ఒక్క తప్పే ఆయనకి శాపంగా మారిందా..?

అందువల్ల బాలయ్య బాబు క్రేజ్ అనేది విపరీతంగా పెరిగినప్పటికీ, క్లాస్ ఆడియన్స్ లో మాత్రం కొంత వరకు తగ్గిపోయింది.

Written By:
  • Gopi
  • , Updated On : February 6, 2024 8:42 pm
    Follow us on

    Balakrishna Movies : నందమూరి నట సౌర్వబౌముడు గా మంచి గుర్తింపు సంపాదించిన ఎన్టీఆర్ నట వారసుడిగా బాలయ్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈయన మొదట్లో తండ్రి సహకారంతో కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ఆ తర్వాత తనకు తానుగా సొంత ఇమేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా మాస్ లో ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్న తెలుగు హీరో గా చరిత్రలో నిలిచాడు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు చేసిన మాస్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి.

    ముఖ్యంగా ఆయన బి గోపాల్ డైరెక్షన్ లో చేసిన సినిమాలు వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఆయన ఇమేజ్ ని తార స్థాయి కి చేరుకునేలా చేశాయి. ఇక ఇలాంటి క్రమంలోనే మిగతా హీరోలందరూ అన్ని రకాల జానర్స్ లో సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తే బాలయ్య మాత్రం ఓన్లీ మాస్, యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలనే ఎక్కువగా చేసుకుంటూ ముందుకు కదిలాడు. దీనివల్ల కొన్ని రకాల ఆడియన్స్ బాలయ్య బాబు సినిమాలు చూడడం మానేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాలయ్య బాబు సినిమాల్లో వైలెన్స్ ఎక్కువగా ఉంటుందంటూ వాళ్లు వెంకటేష్, నాగార్జున సినిమాలను ఎక్కువగా చూడడం మొదలుపెట్టారు.

    అందువల్ల బాలయ్య బాబు క్రేజ్ అనేది విపరీతంగా పెరిగినప్పటికీ, క్లాస్ ఆడియన్స్ లో మాత్రం కొంత వరకు తగ్గిపోయింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాలయ్య బాబు సినిమాలు థియేటర్ కి వెళ్లి చూడటం మానేశారు. దానివల్లే బాలయ్య బాబు సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ రాకుండా పోయాయి. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినా కూడా బాలయ్య కలెక్షన్స్ లిమిటెడ్ గానే వచ్చేవి, భారీ స్థాయిలో రాకపోవడం తో ఆయన కెరియర్ పైన అప్పుడు భారీ దెబ్బ పడిందనే చెప్పాలి.

    ఆయన కనక క్లాస్ ఆడియన్స్ ని కూడా తన సినిమాలకి రప్పించేలా సినిమాలు చేసినట్లయితే, బాలయ్య బాబు సినిమాల కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉండేవి. కానీ అవి ఏమి పట్టించుకోకుండా బాలయ్య బాబు తన ఫ్యాన్స్ ను మాత్రమే ఆనందింప చేయాలనే ఉద్దేశ్యం తో ఎక్కువగా మాస్ సినిమాలు చేస్తూ వైలెన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ముందుకు సాగాడు. దీనివల్ల బాలయ్య ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం ఆయన సినిమాలని స్కిప్ చేస్తూ వచ్చారు…