Salaar Teaser: ప్రభాస్ ‘సలార్’ మూవీ టీజర్, నేడు ఉదయం 5 గంటల 14 నిమిషాలకు విడుదల చెయ్యగా, దాని ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. #KGF చాప్టర్ 2 సినిమా టీజర్ ని ఎలా అయితే అన్నీ భాషలకు కామన్ టీజర్ గా విడుదల చేసారో, దీనికి కూడా అదే ఫార్ములా ని ఫాలో అయ్యారు.అందులో ఉన్నది ఇంగ్లీష్ డైలాగ్, ఇందులో ఉన్నది కూడా ఇంగ్లీష్ డైలాగ్.
రెండిటికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ‘సలార్’ టీజర్ లో ఫ్యాన్స్ ఎంతసేపు ప్రభాస్ ని చూడాలి అనే ఆత్రుతతో టీజర్ లోని కొన్ని డీటెయిల్స్ ని గమనించడం మర్చిపోయారు. టీజర్ ని విడుదల చేసిన టైం మరియు KGF చాప్టర్ 2 లో రాకీ భాయ్ చనిపోయేటప్పుడు ఉన్న టైం ఒకటే కాబట్టి, ఈ రెండు సినిమాలకు లింక్స్ ఉన్నాయని అభిమానులు అనుకున్నారు.
ఇక నేడు విడుదల చేసిన టీజర్ లో అయితే KGF క్లైమాక్స్ కి సంబంధించిన సన్నివేశాలు క్లియర్ గా కనిపించాయి. KGF చాప్టర్ 2 క్లైమాక్స్ అయిపోగానే ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు ఇక సినిమా అయిపోయింది అని పైకి లేచి వెళ్తున్న ఆడియన్స్ కి , ఎండ్ టైటిల్స్ అయిపోయాక వచ్చే సన్నివేశం తో పార్ట్ 3 కూడా ఉందని హింట్ ఇస్తాడు. ఈ సన్నివేశం ఒక షెడ్ లో జరగడాన్ని మనం గమనించొచ్చు.
ఆ క్లైమాక్స్ లో ఉన్న షెడ్డు, ‘సలార్’ టీజర్ లో కూడా కనిపించింది. ఇదే ఇక్కడ పెద్ద ట్విస్ట్, దీనిని ఎవరూ గమయించలేకపోయారు. అంటే రాకీ భాయ్ మరియు సలార్ ఇద్దరు కలుసుకుంటారు అన్నమాట. ఇదే కనుక జరిగితే థియేటర్స్ బ్లాస్ట్ అయిపోవడం ఖాయం అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని అందుకోవడం రాజమౌళి సినిమాలకు కూడా సాధ్యపడదు, మరి ఇది నిజమా కాదా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 28 వ తారీఖు వరకు ఆగాల్సిందే.