Rajinikanth On Amitabh Bachchan: సౌత్ ఇండస్ట్రీలో రజినీ కాంత్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో నెంబర్ 1 హీరోగా గుర్తింపు పొందారు. ఈయన సినిమాలు కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటాయి. ఇక నార్త్ లో ఈయనకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్, గుర్తింపును సంపాదించారు అమితాబ్ బచ్చన్. అయితే ఈ రేంజ్ లో స్టార్లుగా ఎదిగిన ఈ ఇద్దరు హీరోలు కూడా కెరీర్ తొలినాళ్లలో చిన్నపాటి పాత్రలు కూడా చేసేవారు.
అయితే ప్రస్తుత రోజుల్లో సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలు సైతం విలన్స్ క్యారెక్టర్లు చేయడానికి వెనకాడటం లేదు. నటుడు అన్న తర్వాత ఏ పాత్ర అయినా చేయాలనే ఉద్దేశంతోనే చేస్తారు కొందరు. అయితే అమితాబ్ బచ్చన్ మామూలు పాజిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు వేసినా సరే ఎప్పుడు కూడా విలన్ గా కనిపించలేదు. అయితే విలన్ రోల్స్ అమితాబ్ కు రాలేదు అనుకోవడం పొరపాటే. ఎందుకంటే 2010 ఐశ్వర్యరాయ్, రజినీకాంత్ కాంబినేషన్ లో శంకర్ డైరెక్ట్ చేసిన రోబో సినిమాలో విలన్ క్యారెక్టర్ ఆయన వద్దకే వచ్చిందట.
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా డ్యానీ అనే నటుడు నటించారు. కానీ శంకర్ ఈ సినిమాకు అమితాబ్ బచ్చన్ ను తీసుకోవాలి అనుకున్నారట. ఈ విషయాన్ని రజినీకాంత్ కు కూడా చెప్పారట. కానీ దానికి ఈ హీరో ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు హీరోగా కొనసాగిన బిగ్ బీను విలన్ పాత్రలో ప్రేక్షకులు అస్సలు ఒప్పుకోరు అని భావించారట రజిని. సార్ అది మీకు సినిమాకు మంచిది కాదు అని అమితాబ్ బచ్చన్ కూడా చెప్పారట రజినీకాంత్. అయితే పాత్ర గురించి తెలిసిన తర్వాత అమితాబ్ బచ్చన్ కూడా శంకర్ తో సున్నితంగా సూట్ కాదని చెప్పారట.
ఈ విషయాన్ని స్వయంగా ఒక సందర్భంగా తెలిపారు బిగ్ బీ. దాని తర్వాత రోబో 2.0 లో చేయబోతున్నారనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అది జరగలేదు. అమితాబ్ కి బదులు అక్షయ్ కుమార్ ని శంకర్ ప్రతి నాయకుడిగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బీ, రజినీ ఇద్దరు కలిసి హిందీ సినిమాల్లో కలిసి నటించారు. అంధా కానూన్, గిరఫ్ తార్, హమ్ వంటి చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మొత్తం మీద బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న రోజో లో మాత్రం రజిని ఆలోచన వల్ల అమితాబ్ నటించలేదు.