Guntur Kaaram Dialogue: సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా లాంటి క్లాసికల్ హిట్ల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. దాదాపు రూ. 200 కోట్ల వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ముందుగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీయాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల టాలీవుడ్ కే పరిమితం చేశారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి లీకైన ఒక డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేమిటి అంటే ఇందులో మహేష్ బాబు గురించి ఒక వ్యక్తి..’ చాలా మొండివాడు గురువుగారు.. సరుణ కోపం వస్తుంది చూడండి’ అని అనగా మరో క్యారెక్టర్… ‘తెలుస్తోంది వారికి మొత్తం వారి అమ్మ పోలిక’ అని అంటారట. ఇక ఈ డైలాగ్ లు కావాలి అంటే మహేష్ అభిమానులు ఆనందపడిపోతున్నారు. ఈ సినిమాలో తప్పకుండా మహేష్ కారెక్టర్ పోకిరిలో లాగా రఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది అని అంచనాలు వేసేస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన చిన్న వీడియో అలానే పోస్టర్ మహేష్ బాబుని మంచి మాస్ లుక్కులో చూపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ డైలాగు విని ఈ సినిమా పైన మరిన్ని ఆశలు పెట్టుకునేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు.
ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి సినిమాలో చేయనున్నాడు మహేశ్. ఈ మూవీ కోసం ఇప్పటి నుంచే తెగ కష్టపడుతున్నాడట సూపర్ స్టార్. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. స్కిప్ట్ ఫైనల్ అవ్వగానే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ సైతం పాలుపంచుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి