Dhurandhar Part 2: రీసెంట్ గా విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘దురంధర్'(Dhurandhar Movie) బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని తలపించే వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 70 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. మొదటి రోజు కూడా ఈ రేంజ్ టికెట్స్ అమ్ముడుపోవడం కష్టం, అలాంటిది 9 వ రోజు ఈ రేంజ్ టికెట్ సేల్స్ అనేది హిస్టారికల్ అనే చెప్పాలి. కేవలం ‘పుష్ప 2’ చిత్రానికి మాత్రమే ఈ రేంజ్ ట్రెండ్ కనిపించింది. ఇప్పుడు మళ్లీ అంతకు మించిన ట్రెండ్ ఈ సినిమాకే కనిపిస్తుంది. ఈరోజు, లేదా రేపు బుక్ మై షో యాప్ లో లక్షకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 8 రోజుల్లో ఇండియా వైడ్ గా 250 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.
ఇప్పుడు ఈ వీకెండ్ తో కచ్చితంగా 350 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్ల టార్గెట్ ని ఈ చిత్రం చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే , ఈ సీఎంగా వసూళ్లు వర్కింగ్ డేస్ లో కూడా వేరే లెవెల్ లో ఉండడమే. సాధారణంగా ఏ సూపర్ హిట్ సినిమాకు అయినా వీకెండ్స్ లో , లేదా పండగ సీజన్స్ లో భారీ వసూళ్లు నమోదు అవ్వడం మనం చూస్తుంటాము. కానీ ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ లో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. నిన్న వచ్చిన వసూళ్లకంటే, నేడు వచ్చే వసూళ్లే ఎక్కువగా ఉన్నాయి. ఇలా ట్రెండ్ ఏ మాత్రం కూడా తగ్గకుండా, అదే రేంజ్ ఊపు ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తోంది.
కాబట్టి ఈ చిత్రం ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లోనే. సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ ని కూడా కొంతభాగం చేశారట. వచ్చే ఏడాది మార్చి 19న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉంది. కాబట్టి ఈ చిత్రానికి పోటీ గా రావాలంటే సౌత్ సినిమాలు భయపడుతున్నాయి. ముఖ్యంగా అదే తేదీన విడుదల అవ్వబోతున్న టాక్సిక్ చిత్రాన్ని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. దురంధర్ సీక్వెల్ తో పోటీ కి వెళ్తే నష్టపోవడం తప్ప, మరో గత్యంతరం లేదని, అందుకే వాయిదా పడనుంది అని అంటున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ పెద్ది సినిమాలు కూడా క్లాష్ ని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయట. ఈ సినిమాలన్నీ ఈ తేదీన విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు.