Dhurandhar 2 : నేడు విడుదలైన ‘ధురంధర్ 2 ‘(Dhurandhar 2 : The Revenge) టీజర్ పై సోషల్ మీడియా లో అభిమానుల నుండి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. టీజర్ అదిరిపోయింది కదా?, ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే అనుమానం మీకు రావొచ్చు. కానీ ఈరోజు టీజర్ లో చూపించిన షాట్స్ ఒక్కటి కూడా కొత్తవి లేవు. ‘ధురంధర్’ చిత్రం క్లైమాక్స్ తర్వాత పార్ట్ 2 కి సంబంధించి కొన్ని షాట్స్ ని చూపిస్తారు. ఈరోజు విడుదలైన టీజర్ లో కూడా దాదాపుగా అవే చూపించారు. ఇంకా చెప్పాలంటే సినిమాలో చూపించిన ‘ధురంధర్ 2 – ది రివెంజ్’ షాట్స్ ఇంకా బాగున్నాయని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకు కొత్త కంటెంట్ ని చూపించలేదు?, ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ ఎందుకు ఇచ్చారు?, మేమేదో కొత్త కంటెంట్ ని వదులుతున్నారేమో అని అనుకున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే టీజర్ లో కొత్త షాట్స్ లేకపోవడం తో అసలు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం మంచి డేట్ ని లాక్ చెయ్యాలి, అప్పటి లోపు సినిమా రెడీ అయితే విడుదల అవుతుంది, లేదంటే లేదు అనే మోడ్ లో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది . అయితే ఇక్కడే ఒకటి మన నెటిజెన్స్ అర్థం చేసుకోవాలి. టాలీవుడ్ లో లాగా నెలకు ఒక విడుదల తేదీని ప్రకటించడం లాంటివి బాలీవుడ్ లో ఉండదు. వాళ్ళు ఒక్కసారి విడుదల తేదీ వేశారంటే, నూటికి నూరు శాతం ఆ తేదీన వచ్చేస్తుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ హిస్టరీ లో కేవలం రెండు మూడు సార్లు మాత్రమే ఇలా జరిగింది. సాధ్యమైనంత వరకు చెప్పిన తేదీన రావడమే అక్కడ జరిగింది. ఈ నేపథ్యం లో ‘ధురంధర్ 2’ కూడా ఎలాంటి వాయిదా లేకుండా చెప్పిన సమయానికి రావొచ్చని అంటున్నారు.
రీసెంట్ గానే ‘ధురంధర్’ చిత్రం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీ తో పాటు తెలుగు వెర్షన్ మరియు ఇతర వెర్షన్స్ కూడా అందుబాటులో ఉండడం తో కచ్చితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభంజనం సృష్టిస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన వెంటనే ‘డెకాయిట్’ విడుదల తేదీని వాయిదా వేశారు. అదే విధంగా యాష్ టాక్సిక్ చిత్రం కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయని అంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రమే ఈ చిత్రానికి పోటీ గా వారం రోజుల గ్యాప్ వస్తోంది. మార్చి 26 న ఆ చిత్రం విడుదల కాబోతుంది.